Senior Citizen Card వలన ఉపయోగాలు ఏంటి ? ఎలా పొందాలి ? Senior Citizen Card వలన ఉపయోగాలు ఏంటి ? ఎలా పొందాలి ?

Senior Citizen Card వలన ఉపయోగాలు ఏంటి ? ఎలా పొందాలి ?

 

How To Apply For Senior Citizen Card ?

How to get Senior Citizen Card Complete Process 

వృద్దులకు ఎంతగానో ఉపయోగపడే  Senior Citizen Card ఇప్పుడు నేరుగా మీ గ్రామా వార్డు సచివాలయంలోనే పొందవచ్చు . ఈ కార్డు కోసం ఒకప్పుడు జిల్లా కేంద్రం లో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది అందువలన చాలా సమయం, డబ్బులు వృధా అయ్యేది , ఇప్పుడు తక్కువ డబ్బులకు దగ్గరలోనే ఉన్న సచివాలయం లో దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది . Senior Citizen Card దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది.


Senior Citizen Card Benefits

Senior Citizen Card ఉంటే బోలెడన్ని Benefits పొందవచ్చు. Govt Schemes సులభంగా పొందొచ్చు. వయసు ధ్రువీకరణకు ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలన్నీ పొందొచ్చు. 


  JOIN WHATSAPP CHANNEL NOW  


2006లో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈమేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. అప్పటి నుంచీ ఇది అమలులో ఉంది. ముదిమి వయసులో కన్నబిడ్డల నిరాదరణకు గురైన వారికి, ఏ ఆదరువూ లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకూ ఇది ఉపయోగపడుతుంది.

Senior Citizen Card Benefits

RTC Bus 

  • టికెట్లో 25 శాతం రాయితీ లభిస్తుంది. 
  • దూరప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నిటిలో వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు.


Railway Lower Berth

  • రైల్వేస్టేషన్లలో వయోవృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి. 
  • అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్బైర్ సదుపాయం ఉంటుంది. 
  • 60 ఏళ్లు దాటిన వృద్ధులు. 45 ఏళ్లు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణులకు లోయర్ బెర్త్ రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది.
  • ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు బెర్త్ లు వీరికి కేటాయిస్తారు. థర్డ్ ఏసీలో నాలుగు బెర్తు... సెకెండ్ ఏసీలో మూడు బెర్త్లు రిజర్వ్ చేస్తారు వీరిలో ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి ఈ బెర్త్ ను ఇస్తారు.


Post Offie benefits 

  • 60 ఏళ్లు దాటిన వారికి కొత్త పాస్పోర్టు కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో 10 శాతం తగ్గింపు ఉంటుంది. సాధారణ పౌరులకు ఫీజు రూ.1,500కాగా వృద్ధులు రూ.1,350 మాత్రమే చెల్లించాలి.
  • పాస్పోర్టు సేవా కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తారు. ప్రాధాన్యతాక్రమంలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు.


Court Case Benefits

  • సీనియర్ సిటిజన్లకు సంబంధించిన కేసుల విచారణ విషయంలో న్యాయస్థానాలు ప్రాధాన్యమిస్తాయి.
  • వారు లేఖ రాసినా లేదా విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరినా వారి కేసులకు ప్రత్యేక విచారణ తేదీలు కేటాయిస్తారు.


Bank benefits

  • బ్యాంకుల్లో ప్రత్యేక వరస ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. 
  • సర్వీసుల్లోనూ ప్రాధాన్యమిస్తారు. 
  • ఫిక్స్డ్ డిపాజిట్లపై 60-79 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇతరులకంటే అదనపు 0.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 
  • 80 ఏళ్లు పైబడిన వారికి 1% వడ్డీ రేటు లభిస్తుంది కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో 80 ఏళ్లు పైబడిన వారికి 8.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 
  • 60-79 ఏళ్ల మధ్య ఉన్న వారికి 7.9 శాతం వడ్డీరేటు లభిస్తుంది. 
  • కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. 
  • ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితి ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది. 
  • కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకుని ఇంటి వద్దనే సేవలు అందిస్తారు.


Tax Benefits 

  • 60 ఏళ్లు పైబడిన వారికి రూ.7 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు.
  • 80 ఏళ్లు పైబడిన వారికి రూ.10 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు
  • 2025-26 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారికి రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఉండనుంది.
  • సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితి రూ. లక్షకు పెంపు


Senior Citizen Card Eligibility 

  • 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
  • ఉద్యోగం , వ్యాపారం తో సంబంధం లేకుండా ఎవరు అయినా పొందవచ్చు .
  • ఆధార్ కార్డు లో వయసు కావాలని ఎటువంటి ఆధారం లేకుండా పెంచుకున్న వాలారు అనర్హులు .
  • ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్న అర్హులు . 


How To Apply For Senior Citizen Card ?

దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. లేదా జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా తీసుకోవచ్చు. జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును ఇస్తారు. గ్రామాల్లో ఉన్న వారికి వారంలో కార్డు మంజూరవుతుంది. తెలంగాణలో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సచివాలయం లో Senior Citizen Card Application Fee 40/- మాత్రమే .



Documents Required For Senior Citizen Card 

  1. Application Form 
  2. Passport Size Photo 
  3. Aadhaar Card 
  4. Bloog Group Type
  5. Emergency Contact Person Name
  6. Emergency Contact Person Number
  7. Aadhaar Update History Download

Download Application Form

Senior Citizen Card SLA Period ?

Senior Citizen Card ను దరఖాస్తు చేసిన వెంటనే పొందవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో దరఖాస్తు చేసిన 7 రోజుల సమయం పెట్టె అవకాశం ఉంది. గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసినప్పుడు ఆధార్ అప్డేట్ హిస్టరీలో దరఖాస్తుదారుడు వయసు / పేరు / లింగము సరైన ఆధారాలు లేకుండా మార్చినట్టు అయితే  అది గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉద్యోగులైన డిజిటల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ నుండి జిల్లా స్థాయిలో ఉన్న సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ వారి లాగిన్ కు వెళ్తుంది , వారు ఆధార్ అప్డేట్ హిస్టరీ ని  క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆమోదం లేదా అప్లికేషన్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి 7 రోజుల సమయం ఉంటుంది. అదే ఆధార్ కార్డు లో ఎటువంటి మార్పులు చేర్పులు జరగకపోతే వారికి నేరుగా గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసిన వెంటనే కింద చూపినట్టుగా సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది వస్తుంది. దీనిని కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకొని దేశంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.


How To Check Senior Citizen Card Application Status Online ?

Senior Citizen Card ను గ్రామా లేదా వార్డు సచివాలయం లో దరఖాస్తు చేసుకున్న తరువాత అప్లికేషన్ ఫీజు 40/- పేమెంట్ పూర్తి చేసాక , కింద చూపినట్టుగా రసీదు ఇస్తారు . 

Check Senior Citizen Card Application Status Online
అందులో SCC Number అంటే Senior Citizen Card Number  ను కింద లింక్ ఓపెన్ చేసి Application Status Check బాక్స్ లో ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు . 

Know Senior Citizen Card Status

Approved అని వస్తే సచివాలయం కు విసిట్ చేసి కింద చూపిన విధంగా ప్రింట్ తీసుకోవాలి . 


senior Citizen card model in Andhra Pradesh



Post a Comment

1 Comments
  1. Senior citizen cards Mee seva lo kuda online chestaru e vishayam kuda prajalaki teliyajeyandi

    ReplyDelete