AP Ration Card లో Relationship , Age , Gender and Address మార్చుకునే విధానం AP Ration Card లో Relationship , Age , Gender and Address మార్చుకునే విధానం

AP Ration Card లో Relationship , Age , Gender and Address మార్చుకునే విధానం

AP Ration Card Details Correction Change DOB in AP Rice Card AP Ration Card Address Update Edit Gender in AP Ration Card AP Rice Card Relationship Change


Andhra Pradesh Ration Card Correction – All Changes in One Place

AP Ration Card Correction: Update Age, Date of Birth, Gender & More - AP Ration Card లో Age, Gender, Relationship and Address మార్చుకునేందుకు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రామ వార్డు సచివాలయాలలో గతంలో ఉన్న సర్వీసు Rice Card Address ను Change of Details in Rice Card గా పేరు మారుస్తూ రైస్ కార్డులో చిరునామా మార్పు తో పాటుగా పుట్టిన తేదీలు తప్పుగా ఉంటే వాటిని మార్చుకోవటం లింగము మహిళలకు పురుషులుగా పురుషులకు మహిళలుగా ఉంటే వాటిని మార్చుకోవటం  కుటుంబంలో ఒకరికి ఒకరితో సంబంధం బంధుత్వం తప్పుగా ఉన్నట్టయితే వాటిని మార్చుకునేందుకు  రాష్ట్రంలో ఉన్న రైస్ కార్డు కలిగిన ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఆప్షన్ కల్పించింది .  

ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ? 

AP Ration Card Correction: Update Age, Date of Birth, Gender & More
రైస్ కార్డు ఎక్కడైతే మీరు కలిగి ఉంటారో ఆయా గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్లి మీరు Change of Details in Rice Card దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయం అయితే డిజిటల్ అసిస్టెంట్ వారిని అదే వార్డు సచివాలయం అయితే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ సెక్రటరీ వారిని కలిసి కింద చెప్పిన ఫారాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.  రైస్ కార్డులో వివరాల అప్డేట్ కేవలం ఆ కుటుంబం హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ ఏ గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధిలో అయి ఉంటుందో అక్కడ మాత్రమే అవుతుంది . ఒకవేళ రైస్ కార్డు ఒకరే పరిధిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒక సచివాలయ పరిధిలో ఉన్నట్లయితే ప్రజలకు ఎక్కడైతే రైస్ కార్డ్ కావాలి అనుకుంటున్నారో అక్కడికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్చుకొని రైస్ కార్డు చిరునామాతో పాటుగా ఇప్పుడు చెప్పిన వివరాలను కూడా మీరు ఒకేసారి అప్డేట్ చేసుకోవచ్చు .


అప్లికేషన్ కు ఏం కావాలి ? 

AP Ration Card Correction: Update Age, Date of Birth, Gender & More

  1. దరఖాస్తు ఫారం [ Download
  2. గతంలో ఉన్న రైస్ కార్డు జిరాక్స్
  3. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జెరాక్స్ కాపీలు 
  4. పుట్టిన తేదీ మార్చడానికి సంబంధిత డాక్యుమెంట్లు అనగా [ SSC / DOB / Aadhaar etc.. ]
  5. బంధుత్వం తెలుపుతూ ఉన్నటువంటి ఏదైనా డాక్యుమెంట్ [ As Per Req ] 
  6. లింగము తెలుపుతూ ఉన్నటువంటి ఏదైనా డాక్యుమెంట్ [ As Per Req ] 


అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ? 

AP Ration Card Correction: Update Age, Date of Birth, Gender & More
గతంలో రైస్ కార్డులో చిరునామా మార్చినట్టయితే సంబంధిత సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు దరఖాస్తు చేసిన తర్వాత నేరుగా సంబంధిత తహసీల్దారు వారి లాగిన్ కు తుది ఆమోదం కొరకు అప్లికేషన్ వెళ్ళేది కానీ ఇప్పుడు ఆ యొక్క ప్రాసెస్ ను మార్చడం జరిగింది సచివాలయంలో దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత గ్రామాల్లో గ్రామ రెవెన్యూ అధికారి పట్టణాల్లో వార్డు రెవెన్యూ సెక్రటరీ వారి లాగిన్ లో ఆమోదం తెలపాల్సి ఉంటుంది అదేవిధంగా వారు ఎవరి వివరాలైతే అప్డేట్ చేస్తున్నారు వారికి సంబంధించి eKYC కూడా GSWS Employees Mobile App లో తీసుకోవాల్సి ఉంటుంది వారి ఆమోదం పూర్తయిన తర్వాత సంబంధిత తాసిల్దారు వారి లాగిన్ కు తుది ఆమోదం కు వెళ్తుంది వారి ఆమోదం తెలిపినట్టు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి అవుతుంది.  అప్లికేషన్ చేసిన రోజు నుంచి 21 రోజుల లోపు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది .


అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ?

దరఖాస్తు చేసిన తర్వాత దరఖాస్తు చేసిన రోజు నుంచి 21 రోజుల లోపు సంబంధిత మండల రెవెన్యూ అధికారి వారి లాగిన్ లో మీ యొక్క అప్లికేషన్ తుది ఆమోదం అవడం లేదా రిజెక్ట్ అవడం అనేది జరుగుతుంది. ఈలోపు మీయొక్క అప్లికేషన్ స్టేటస్ను మీరు సొంతంగా చెక్ చేసుకునే ఆప్షన్ ప్రభుత్వం కల్పించింది.  దరఖాస్తు చేసిన తర్వాత మీకు సచివాలయంలో ఇచ్చేటువంటి రసీదులో అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ను మీరు నోట్ చేసుకొని కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి 

Check Application Status Link

అందులో Service Request Status Check అనే ఆప్షన్ దగ్గర మీరు ముందుగా నోట్ చేసుకున్నటువంటి అప్లికేషన్ నెంబర్ను నమోదు చేసి అడిగినటువంటి క్యాప్చకోడ్ ని నమోదు చేసి సబ్మిట్ చేసినట్లయితే ప్రస్తుతం అప్లికేషన్ ఆమోదం పొందిందా ? రద్దు అయిందా ? అనే విషయం మీకు తెలుస్తుంది . దీనిని మీరు మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు లేదా కంప్యూటర్ లోనైనా చెక్ చేసుకోవచ్చు చెక్ చేయడానికి ఎటువంటి ఫీజు ఉండదు .  


కొత్త రేషన్ కార్డు ఎలా పొందాలి ?

సంబంధిత తహసీల్దారు MRO వారి తుది ఆమోదం పొందిన తర్వాత రైస్ కార్డులు నేరుగా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతానికి ప్రజలకు అందుబాటులో లేదు. ప్రభుత్వమే ప్రజలకు సర్వీసులన్నీ దరఖాస్తు పూర్తయిన తర్వాత మరియు గతంలో ఎటువంటి దరఖాస్తు చేయకుండా రైస్ కార్డు కలిగిన వారికి కొత్తగా QR Code Enabled Smart Ration Card క్యూఆర్ కోడ్ కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డును అనగా ATM Card సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డును రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈలోపు సభ్యులను జోడించడం సభ్యులను తొలగించడం ఒక కార్డును రెండు కార్డుగా విభజించడం వంటి సేవలను దరఖాస్తు చేసి తుది ఆమోదం పొందిన వారు కింద ఇవ్వబడిన ప్రాసెస్ ద్వారా నేరుగా మీ మొబైల్ లోనే రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకున్న  కార్డును ప్రింట్ తీసుకొని దేశంలో ఎక్కడైనా సరే రేషన్ కార్డుగా మీరు ఉపయోగించుకోవచ్చు .

View More

Post a Comment

0 Comments