పేదల గుర్తింపుకు మరో సర్వే .. AP P4 Need Assessment Survey 2025 పేదల గుర్తింపుకు మరో సర్వే .. AP P4 Need Assessment Survey 2025

పేదల గుర్తింపుకు మరో సర్వే .. AP P4 Need Assessment Survey 2025

P4 Need Assessment Survey 2025

What is P4 Policy in Andhra Pradesh ? 

AP P4 Need Assessment Survey: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఆర్థికంగా Financial Help మరియు స్కిల్ Skill Sharing పరంగా సహాయం చేసేందుకు, సహాయం చేసేవారు సహాయం పొందాలి అనుకునే వారికి అంతర్జాలం లో ట్యాగ్ చేస్తూ వారికి నిరంతరంగా సర్వీసులను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం P4 POLICY ను ప్రారంభించింది. సహాయం చేసే వారిని మార్గదర్శిగా [ Margadarshi ] సహాయం పొందే కుటుంబాన్ని బంగారు కుటుంబంగా [ Bangaru Kutumbam ] పిలుస్తారు. P4 అంటే ప్రభుత్వం, దాతల, ప్రజల భాగస్వామ్యం [ Public, Private, People Partnership అని అర్థము . 

రాష్ట్రంలో ఉన్న ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా గ్రామ / వార్డు సచివాలయాలలో ఆ సచివాలయ ఉద్యోగులతో AP GSWS Employees మార్చి నెల 2025 నుండి ప్రభుత్వం సర్వేను చేసింది. ఆ సర్వేలో సిబ్బంది 26 విషములపై వారికి కేటాయించిన క్లస్టర్లలో ఉన్న అన్ని ఇళ్లకు సర్వే చేశారు. 

What is P4 Survey ? Know Quationaries ?

సర్వే పూర్తయిన తర్వాత సర్వే పూర్తయిన కుటుంబాల జాబితాను గ్రామసభలలో ఆమోదం తెలపడం జరిగింది మరియు ప్రజలకు అందుబాటులో సచివాలయాలలో నోటీసు బోర్డులో పెట్టడం జరిగింది. సర్వేలో పాలుపంచుకొని వారికి కూడా జోడించేందుకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి Panchayat Secretary వారికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఇదంతా మార్చి నెలలో జరిగిన విషయం. 

తరువాత జులై నెల 2025 నుండి ప్రభుత్వం ఆ P4 LIST లిస్టులలో ఎవరైతే పేదరికంలో అత్యంత దిగువున ఉన్నటువంటి 20 శాతం ప్రజలను వేరుచేసి వారిని బంగారు కుటుంబాలుగా గుర్తించి వారికి ఆర్థికంగా మరియు స్కిల్ పరంగా సహాయం చేసే వారిని మార్గదర్శకులుగా గుర్తించి ఇరువురిని అంతర్జాలంలో జోడించడం ప్రారంభించింది. 

poverty p4 ap gov in P4 Official Web SIte

దీనికిగాను ఎవరైనా సరే ఆర్థికంగా లేదా వారికి ఉన్నటువంటి స్కిల్ ను ఇతరులకు పంచేందుకుగాను సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ను కూడా ప్రారంభించడం జరిగినది. సహాయం పొందేందుకుగాను బంగారు కుటుంబంగా నమోదు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం ఈ వెబ్సైట్లో ఆప్షన్ కల్పించడం జరిగింది. 

Official P4 Web Site 

రాష్ట్రవ్యాప్తంగా జూలై నెల 2025 లో ప్రభుత్వం విడుదల చేసిన లిస్టులలో నిజమైన అర్హులను గుర్తించి అనర్హులను తీసివేస్తూ లిస్టులో పేరు లేని నిజమైన అర్హులను జోడించేందుకుగాను ఆయా గ్రామసభలలో చర్చించేందుకుగాను గ్రామ సభలు నిర్వహించేందుకు ఉత్తర్వులను విడుదల చేయడం జరిగినది. 

గ్రామ సభలలో అర్హులను కింద తెలిపిన ప్రమాణాల మేరకు గుర్తించడం జరిగింది . ఈ క్రింది సమస్యలలో కనీసం ఒక్కటి అయినా ఉంటే, ఆ కుటుంబం పథకానికి అర్హత పొందవచ్చు:

Bangaru Kutumbam Eligibility

  • ఎల్పీజీ లేని కుటుంబం సంప్రదాయ ఇంధనాన్ని (vedi, veduru, coal) వాడుతున్నవారు.
  • విద్యుత్ లేని కుటుంబం ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేనిది.
  • ఆదాయం లేని కుటుంబం ఉద్యోగం, రెంట్, ఇంటరెస్ట్, పెన్షన్ వంటివి ఏదీ లేనిది.
  • శుద్ధమైన తాగునీరు అందుబాటులో లేని కుటుంబం తాగునీరు తేవడానికి 30 నిమిషాల రౌండ్ ట్రిప్ అవసరమయ్యే పరిస్థితి.
  • బ్యాంక్ ఖాతా లేని కుటుంబం కుటుంబంలో ఎవరికి బ్యాంక్ ఖాతా లేనిది.

Bangaru Kutumbam Ineligibility

ఒకటి ఉన్నా ఆ కుటుంబం P4 List నుండి తొలగించబడుతుంది  

  • భూమి కలిగిన కుటుంబం మొత్తం 5 ఎకరాలకన్నా ఎక్కువ భూమి లేదా 2 ఎకరాలకన్నా ఎక్కువ తడిబడి భూమి కలిగి ఉండటం. 
  • ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే. 
  • పట్టణ ప్రాపర్టీ (Municipal Property) మున్సిపల్ ప్రాంతంలో ఆస్తి కలిగి ఉంటే. 
  • ఆదాయపు పన్ను చెల్లింపు కుటుంబంలో ఎవరైనా Income Tax payer అయితే. 
  • నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్న కుటుంబం Four-wheeler వాహనం కలిగి ఉంటే. 
  • విద్యుత్ వినియోగం అధికంగా ఉండటం నెలకు సగటున 200 యూనిట్లకన్నా ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటే.

GSWS Helper WhatsApp Channel Link

ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా గతంలో అనగా మార్చి 2025 లో చేసినటువంటి సర్వేలో ఉన్నటువంటి ప్రశ్నలలో మార్పు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసినటువంటి పేదరికంలో అత్యంత దిగువున ఉన్నటువంటి 20% ప్రజలను గుర్తించేందుకుగాను మరలా జూలై 20 నుండి P4 NEED ASSESSSMENT SURVEY ను ప్రారంభించడం జరిగినది. 

ఈ సర్వేను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారికి కేటాయించిన క్లస్టర్లో ఒక్కొక్క కుటుంబం వద్ద సరాసరిగా 15 నిముషాల నుండి అరగంట సమయం కేటాయిస్తూ సర్వేలో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చేయాల్సి ఉంటుంది సర్వేలో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు లేకపోతే జోడించేందుకు, కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా మరణిస్తే వారిని తొలగించేందుకు అన్ని ఆప్షన్లో కూడా ఇవ్వడం జరిగినది . 

P4 Need Assessment Survey Process

P4 Need Assessment Survey Process

సర్వే పేరు: P4 Need Assessment Survey 

సర్వే ప్రారంభ తేదీ: 20-07-2025

సర్వే చేయాల్సిన వారు: గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది

సర్వే ఎవరికి చేయాలి: యాప్ లో వచ్చిన పేర్లకు

సర్వే ఎందులో చేయాలి: P4 Need Assessment App [ Download App

లాగిన్ ఎలా: ఉద్యోగి ఆధార్ నెంబరు ద్వారా

లాగిన్ పాస్వర్డ్ ఏమిటి: 1234 [ లాగిన్ అయ్యాక మార్చుకోవాలి ] 

సర్వే రిపోర్టు లింకు: Click Here For Report Link 

సర్వేలో పేరు లేకపోతే: కుటుంబంలో నమోదు అవని వారివి యాప్ లో జోడించవచ్చు. 


P4 Need Assessment Quationaries 

www.GSWSHelper.com Need  Assessment  SURVEY ప్రశ్నలు

1. మొబైల్ నెంబరు 

2. చూపిస్తున్న వ్యక్తి కుటుంబంలో ఉన్నారా లేదా 

3. కొత్త సభ్యులను జోడించాలా ?

జోడిస్తే వారి పూర్తి పేరు 

  • లింగము 
  • పుట్టిన తేదీ 
  • వివాహ స్థితి 
  • తండ్రి లేదా భర్త పేరు 

4. సంపాదిస్తున్నారా ? సంపాదిస్తే సంపాదన రకము 

  • అగ్రికల్చర్ 
  • డైలీ లేబర్ 
  • నో రెగ్యులర్ జాబ్ 
  • చిన్న బిజినెస్ 
  • ఇంటి పని 
  • ప్రైవేట్ ఉద్యోగం 
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం 
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం 
  • ఇతర ఉద్యోగం / ఇతర పని

5. నెలసరి వచ్చే ఆదాయం

6. ఏదైనా ప్రత్యేక సహాయం కావాలా ? అయితే ఎవరికి 

  • ప్రెగ్నెంట్ మహిళ / కొత్తగా పుట్టిన బిడ్డ 
  • జబ్బు చేసిన ఇంట్లో మనిషి 
  • ముసలివారికి 
  • విద్యార్థులు లేదా పై చదువులు చదువుకుంటున్న వారికి 
  • ఉద్యోగం లేని ఉద్యోగం కావాలనుకునే వారికి

7. ప్రస్తుతం కుటుంబం ఉంటున్న చిరునామా 

8. ఇంటి యొక్క జిపిఎస్ లొకేషన్ 

9. కుటుంబం మొత్తానికి నెల మొత్తానికి అయ్యే సరాసరి ఖర్చు ఎంత రూపాయలలో

10. ప్రస్తుతం ఇంట్లో ఏమున్నాయి 

  • మొబైల్ ఫోన్ 
  • 2 వీలర్ 
  • సొంత మూడు లేదా నాలుగు చక్రాల వాహనము 
  • కమర్షియల్ మూడు లేదా నాలుగు చక్రాలు వాహనము 
  • పశువులు
  • వ్యవసాయ భూమి 
  • మున్సిపాలిటీ భూమి 
  • యంత్రాలు ఇతర 
  • ఇంట్లో ఉండాల్సిన వి ఉదాహరణకు టీవీ ఫ్రిడ్జ్ మైక్రో ఓవెన్ లాంటివి

11. ప్రస్తుతం మీ కుటుంబం పొందుతున్న ప్రభుత్వ పథకాలు ఏమిటి?

  • రైస్ కార్డు 
  • తల్లికి వందనం 
  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 
  • దీపం పథకం 
  • ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ 
  • ఫిషర్మెన్ సబ్సిడీ పథకం 
  • హౌసింగ్ పథకం 
  • ఎలక్ట్రిసిటీ సబ్సిడీ 
  • పోస్టుమట్రిక్ స్కాలర్షిప్ 
  • ఇతరములు 

12. మీ ఆదాయం పెంచేందుకు ముఖ్యమైనదిగా దీనిలో మీరు దేనిని భావిస్తారు 

  • మెరుగైన ఉపాధి అవకాశాలను పొందడం
  • చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం లేదా విస్తరించడం ఉదా. విస్తరణకు ఆలోచనలు, అప్‌గ్రేడ్ చేయడానికి రుణం
  • కంప్యూటర్, మార్కెటింగ్, వ్యాపారం వంటి నిర్దిష్ట రంగంలో నైపుణ్య నిర్మాణం
  • ఉన్నత విద్యకు మద్దతు ఉదా; అదనపు డిగ్రీ, స్కాలర్‌షిప్
  • వ్యవసాయ ఆదాయం పెంచేందుకు మద్దతు. ఉదా: మార్కెట్ లభ్యత, పంట ఉత్పాదకత
  • వ్యాపారం / వెంచర్ ప్రారంభించడానికి రుణం పొందడం
  • స్వీయ లేదా కుటుంబానికి వైద్య చికిత్స
  • ఇతరాలు (ఉదా., క్రీడా శిక్షణ, కళాత్మక శిక్షణ మొదలైనవి)

13. మీకు ఏం కావాలో ఆడియో రూపంలో తెలియజేయండి 

చివరగా సబ్మిట్ చేయాలి

P4 Need Assessment Survey Process User Manual 


View More

Post a Comment

0 Comments