AP Disable & Medical Pension Cancellation, Type Change, OAP Conversion Under NTR Bharosa Pension Scheme AP Disable & Medical Pension Cancellation, Type Change, OAP Conversion Under NTR Bharosa Pension Scheme

AP Disable & Medical Pension Cancellation, Type Change, OAP Conversion Under NTR Bharosa Pension Scheme

 

AP Disable Pension Cancellation AP Medical Pension Cancellation AP Pension Type Change Process OAP Conversion in AP NTR Bharosa Pension Scheme Updates AP Pension Cancellation Process NTR Bharosa Pension Type Change AP Disable Pension 2025 News AP Medical Pension 2025 Update NTR Bharosa OAP Conversion Andhra Pradesh Pension Scheme Changes NTR Bharosa Pension Latest News AP Pension Eligibility Change NTR Bharosa Disable Pension Update AP Medical Pension Type Change

Disable & Medical Pension Cancellation, Type Change, OAP Conversion - NTR Bharosa Pension Scheme 2025 

AP Pension Cancellations Update : పింఛన్ల రద్దుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చాలా పుకార్లు నడుస్తున్నాయి, నిజంగానే పింఛన్లు రద్దు అవుతున్నాయా ? రద్దు అయితే ఎవరికి రద్దు అవుతున్నాయి?  అసలు రద్దు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది ? రద్దు చేస్తే ప్రజలకు ఉపయోగమేంటి నష్టమేంటి ? విటిపై చాలా రకాల అపోహలు డిబేట్లు నడుస్తున్నాయి..  ఈ పోస్టులో మీకు ప్రభుత్వం ఆగస్టు నెల 15వ తారీకు నాటికి పింఛన్ల రద్దు, పింఛన్ల పునరుద్ధరణ, పింఛన్ల రకము మార్పుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పూర్తిగా చెప్పడం జరుగుతుంది . 

Cancellation of Ineligible Disable & Medical Pensions in Andhra Pradesh Info 

NTR Bharosa Pension Scheme వికలాంగుల పింఛన్ లో భాగంగా జనవరి 2025 నుండి వికలాంగులకు రీ వెరిఫికేషన్ చేయడం జరుగుచున్న విషయం మీకు తెలిసినదే, ఇందులో భాగంగా ఇప్పటివరకు డాక్టర్ల  ఆమోదం పొందిన అన్ని కేటగిరీల వికలాంగుల శాతంలకు సంబంధించి పెన్షన్ వెబ్సైటుకు అనుసంధానం చేయడం జరిగింది. ఉన్నత అధికారుల మాటల్లో 

  1. ఆదేశముల ప్రకారం హెల్త్ పెన్షన్ అనగా 15000/-  పింఛన్ పొందుతున్న వారికి ఇంటింటికి వచ్చి వెరిఫై చేయడం జరిగినది,  ఎవరికైతే 85% పైబడి వికలాంగత ఉండి మంచానికే పరిమితమైనట్టు డాక్టర్ల సముదాయం రిపోర్ట్ చేసినారో వారికి 15000- యధావిధిగా సెప్టెంబర్ నెల నుంచి వచ్చును. 
  2. వెరిఫికేషన్ లో వికలాంగుల శాతం 85% కంటే తక్కువ ఉంది  40%  కంటే ఎక్కువ ఉన్నట్లయితే హెల్త్ పెన్షన్ నుండి వికలాంగ పెన్షన్లకు అనగా 15000/- నుండి 6000/- కు మార్పు చేయుట జరిగినది. 
  3. 40%  కంటే వికలాంగత తక్కువగా ఉన్న ఎడల పింఛనుదారుల వయసు 60 సంవత్సరాలు పైబడినచో వారికి 15000/- లకు బదులు వృద్ధాప్య పెన్షన్ గా పరిగణించబడి 4000/- రూపాయలకు మంజూరు కాబడినది.
  4. 40% కంటే వికలాంగత తక్కువ ఉండి 60 సంవత్సరాలు లేని యెడల వారికి సెప్టెంబర్ నెల నుండి పింఛన్ నిలుపుదల చేయడం జరుగుచున్నది. 
  5. అదేవిధంగా వికలాంగ  పింఛన్ లో కూడా 40% పైబడి ఉన్నట్లయితే వారికి యధావిధిగా వికలాంగుల పింఛన్ 6000/- వచ్చును.
  6. వికలాంగత శాతం 40% కంటే తక్కువగా ఉండి పింఛన్ దారులకు 60 సంవత్సరాల నిండిన యెడల వారికి వృద్ధాప్య పింఛను గా మార్చబడి 4000/- వచ్చును.
  7. 40%  కంటే తక్కువగా ఉండి 60 సంవత్సరాలు లేని యెడల వారి యొక్క వికలాంగుల పింఛను  సెప్టెంబర్ నెల నుండి నిలుపుదల చేయబడును.
  8. అయితే ఈ విషయంలో  తెలియచేయునది ఏమనగా ఎవరికైతే పింఛన్ నిలుపుదల చేసి ఉన్నారు వారి వివరములు ఇప్పటికే సచివాలయం లాగిన్ లో చూపబడుచున్నవి. 
  9. ఆ నోటీసును డౌన్లోడ్ చేసి పింఛన్ దారులకు అందజేసి ఎక్నాలజీమెంట్ పొందవలెను. ఇది ఈనెల 25వ తేదీ లోపుగా పూర్తి చేయవలెను.
  10. ఎవరైనా దీనిపై అప్పీల్ కి వెళ్ళవలసి వచ్చినచో లేదా ఫిర్యాదు చేయవలసి వచ్చినచో ఈ క్రింది పద్ధతులు పాటించవలెను.  
  11. అర్జులని భావిస్తూ ఎవరి పింఛన్ అయితే రద్దు కాబడినదో వారు పాత సదరం సర్టిఫికెట్ మరియు ఈ నోటీసును తీసుకొని సంబందించిన MPDO / MC వారిని కాంటాక్ట్ అవ్వాలి .
  12. సంబంధిత అధికారులు అప్పీల్ వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. PD DR&DA వారు GGH & DCHS మెడికల్ సూపరిండెంట్ వారితో కోఆర్డినేట్ అయిన తర్వాత అప్పీల్ చేసుకున్న వారికి మరల షెడ్యూల్ వేస్తారు. అప్పీల్ చేసుకున్న పింఛన్దారులకు మరల రీ అసెస్మెంట్ కొరకు ఆసుపత్రి,  తేదీ,  సమయం తో కూడిన నోటీసు సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వటం జరుగును. 
  13. అప్పీల్ ను నోటీసు అందించిన 30 రోజుల లోపు మాత్రమే చేయవలెను.
NTR Bharosa Pension Scheme - Disable and Medical Cancellation Pension Notice Appeal Process


కాబట్టి ఈ విషయాలను మీరు దృష్టిలో ఉంచుకొని తగిన సూచనలు క్రింది వారికి తెలియజేయవలసిందిగా తెలియజేయడం జరుగుతున్నది. 


2025 జనవరి నెల నుండి వికలాంగులు మరియు మెడికల్ పింఛన్లు సంబంధించి రి వెరిఫికేషన్ జరిగిన వాటికి కొత్తగా సదరం సర్టిఫికెట్లు జనరేట్ అవ్వడం జరిగింది, అంటే ఎవరివైతే వికలాంగుల గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నోటీసులు అందుకొని వారి జిల్లాలో వారికి ఇచ్చిన ఫ్లాట్ టైము ప్రకారం ఆయా ఆసుపత్రులకు వెళ్లి వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు వారికి మరియు మెడికల్ పింఛన్లకు [ 15 వేల రూపాయలు పెన్షన్ ] తీసుకుంటున్న వారికి ఎవరికైతే ఇంటి వద్దకు వచ్చి వెరిఫికేషన్ చేసారో వారికి డాక్టరు వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత డాక్టర్ వారి రికమండేషన్ ప్రాప్తికి కొత్తగా సదరం సర్టిఫికెట్లు అదేనండి వికలాంగుల సర్టిఫికెట్ జనరేట్ అవ్వడం జరిగింది. అందులో సదరం సర్టిఫికెట్ వికలాంగుల శాతం ప్రకారం వారికి పెన్షన్ రద్దు, పెన్షన్ రకము మార్పు, పెన్షన్ రకము పునరుద్ధరణ, కొనసాగింపుకు సంబంధించి ఏదో ఒకటి జరుగుతాయి. 


ఈ ప్రక్రియ ప్రభుత్వం చేయడానికి ముఖ్య కారణం రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల గతంలో తప్పుడు సదరం సర్టిఫికెట్లు పొంది చాలామంది వికలాంగులు అవ్వకపోయినప్పటికీ కూడా 6000 పెన్షన్లు అదేవిధంగా 15 వేల రూపాయల మెడికల్ పెన్షన్లు పొందుతున్నారని ఫిర్యాదులు అందాయి, అందులో భాగంగా అర్హులైన వారికి పెన్షన్ అందిస్తూ అనర్హులైన వారికి పెన్షన్ను రద్దు చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వెరిఫికేషన్ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా 2025 జనవరి నెల నుండి ప్రభుత్వం ప్రారంభించింది. రీ అసెస్మెంట్లో ఎవరైతే అనర్హులు ఉంటారో వారికి పెన్షన్ను తొలగించి అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రీ అసెస్మెంట్ ప్రక్రియ చేపట్టింది. గతంలో నోటీసులు అందినప్పటికీ వెళ్ళని వారికి కూడా మరల ఇప్పుడు నోటీసులు జనరేట్ అవ్వడం జరుగుతుంది, ఇప్పుడు కాని వారు వెళ్లక పోతే వారికి పెన్షన్ తాత్కాలిక నిలుపుదల అవ్వడం జరుగుతుంది అంటే 2025 సెప్టెంబర్ నెల నుండి వారికి ఇక పెన్షన్ అందదు.


New SADAREM Certificate Percentage  SADAREM Reassessment AP 2025  NTR Bharosa Pension Reassessment  AP SADAREM Pension Type Change  New SADAREM Percentage for Pension  SADAREM Reassessment Process AP  AP Pension Cancellation SADAREM  NTR Bharosa SADAREM Update  SADAREM Disability Percentage Change  Andhra Pradesh SADAREM Pension Rules  AP Pension Type Change with SADAREM  NTR Bharosa Pension Eligibility 2025  SADAREM Reassessment for Disable Pension  AP Pension Cancellation with SADAREM  SADAREM New Certificate for Pension


రీ వెరిఫికేషన్కు వెళ్లిన వారికి మరియు ఇంటి వద్దకే వచ్చి వెరిఫికేషన్ చేసిన వారికి కొత్త సదరం సర్టిఫికెట్లు విడుదల అయ్యాయి కదా అందులో సదరం శాతం ప్రకారం పెన్షన్ అనేది డిసైడ్ అవుతుంది అంటే సదరం శాతం 40% కన్నా తక్కువ ఉంటే వారికి పెన్షన్ నిలుపుదల అవుతుంది,  అదే 40% కన్నా ఎక్కువ ఉన్నట్టయితే వికలాంగుల పెన్షన్ యధావిధిగా కొనసాగుతుంది. మెడికల్ పెన్షన్ కి సంబంధించి 40% కంటే తక్కువ ఉన్నట్టయితే వారికి పెన్షన్ రద్దు అవుతుంది. అదే 40% - 85% మధ్య ఉన్నట్టయితే వారికి 6000 వికలాంగుల పెన్షన్ రావడం జరుగుతుంది అదే 85% కన్నా ఎక్కువ శాతం ఉన్నట్లయితే వారికి యధావిధిగా మెడికల్ పెన్షన్లు కొనసాగుతాయి. 


అసలు ఎవరికి ఎంత సదరం శాతం వచ్చిందో తెలుసుకునేందుకుగాను కొత్త సదరం సర్టిఫికెట్లు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయినటువంటి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ Digital Assistant అధికారి, వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ Ward Education and Data Processing Secretary  వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ల నోటీసు ఆ నోటీసులో ఏముంటుంది అంటే ఏ రోజున రీ అసెస్మెంట్ జరిగింది, కొత్తగా సదరం శాతం ఎంత వచ్చింది, ప్రస్తుతం పెన్షన్ కొనసాగుతుందా, రద్దు అవుతుందా, లేదా పెన్షన్ రకం మార్పు ఉంటుందా అనే వివరాలు తెలియజేస్తూ నోటీసు సంబంధిత గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అధికారులు , వార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ అధికారుల వారి లాగిన్ లో ఇవ్వడం జరిగింది. నోటీసు నందు పెన్షన్ రద్దు అవుతుందా లేదా కొనసాగుతుందా లేదా పెన్షన్ రకము మార్పు చెందుతుందా అనేది ఇచ్చారు అందులో ఏవైనా సరే సమస్యలు ఉన్నవారు ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. 


AP Pension Cancellation Notice 

పెన్షన్ రద్దు నోటీసు సమాచారం  - మెడికల్ & వికలాంగుల పెన్షన్లకు సంబంధించి కొత్త సదరం సర్టిఫికెట్ నందు ఎవరికైతే 40 శాతం కన్నా తక్కువ శాతం ఉంటుందో వారికి పెన్షన్ నిలుపుదల జరుగుతుంది వారికి కింద తెలిపిన విధంగా నోటీసులు వారి గ్రామ వార్డు సచివాల సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుంది.

Andhra Pradesh Pension Cancellation Notice Model 2025 Under NTR Bharosa Pension Scheme AP Disable Pension Cancellation AP Medical Pension Cancellation AP Pension Type Change Process OAP Conversion in AP NTR Bharosa Pension Scheme Updates AP Pension Cancellation Process NTR Bharosa Pension Type Change AP Disable Pension 2025 News AP Medical Pension 2025 Update NTR Bharosa OAP Conversion Andhra Pradesh Pension Scheme Changes NTR Bharosa Pension Latest News AP Pension Eligibility Change NTR Bharosa Disable Pension Update AP Medical Pension Type Change


AP Pension Type Change Notice  

మెడికల్ పెన్షన్ దారులకు కొత్త సదరం సర్టిఫికెట్ నందు సదరం శాతం 40 నుండి 85 మధ్య ఉన్నట్టయితే వారికి మెడికల్ పెన్షన్ 15 వేల రూపాయల పెన్షన్ నుండి వికలాంగుల పెన్షన్ 6000 రూపాయల పెన్షన్లకు మార్పు చేయడం జరుగుతుంది. వికలాంగుల పెన్షన్ దార్లకు సంబంధించి వికలాంగుల శాతం 40 పైన ఉన్నట్టయితే వారికి యధావిధిగా పెంచను కంటిన్యూ అవుతుంది. మెడికల్ పింఛన్దారులకు సంబంధించి సదరం శాతం 85 కన్నా ఎక్కువ ఉంటే వారికి యధావిధిగా 15 వేల రూపాయల పింఛను కంటిన్యూ అవుతుంది.

Andhra Pradesh Pension Type Change Notice Model 2025 Under NTR Bharosa Pension Scheme AP Disable Pension Cancellation AP Medical Pension Cancellation AP Pension Type Change Process OAP Conversion in AP NTR Bharosa Pension Scheme Updates AP Pension Cancellation Process NTR Bharosa Pension Type Change AP Disable Pension 2025 News AP Medical Pension 2025 Update NTR Bharosa OAP Conversion Andhra Pradesh Pension Scheme Changes NTR Bharosa Pension Latest News AP Pension Eligibility Change NTR Bharosa Disable Pension Update AP Medical Pension Type Change


సదరం శాతం 40 కన్నా తక్కువ ఉంటూ, 60 సంవత్సరాల పైబడి ఇంట్లో ఎవరికి పెన్షన్ రాకపోతే నోటీసు సమాచారం  

గతంలో మెడికల్ లేదా వికలాంగుల పింఛను పొందుతూ వెరిఫికేషన్ లో కొత్త సదరం నందు సదరం శాతం 40 కన్నా తక్కువ వస్తూ వారి వయసు 60 కన్నా ఎక్కువ ఉంటూ ఇంట్లో ఎవరికి పెన్షన్ రాకపోతే వారికి నోటీసు ఇవ్వకుండానే వారి పింఛను వికలాంగుల లేదా మెడికల్ పెన్షన్ నుండి నేరుగా వృద్ధాప్య పింఛను అనగా 15000 రూపాయలు లేదా 6000 రూపాయల పెన్షన్ నుండి నేరుగా 4వేల రూపాయల వృద్ధాప్య పింఛనుకు మార్పు చేయడం జరుగుతుంది వారికి ఆ విధంగా వృద్ధాప్య పింఛను మార్పు చెందినట్టు నోటీసు సంబంధిత సచివాల సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుంది.


అర్హులైన అనర్హులుగా రద్దు లేదా మార్పు చేస్తే ఏం చేయాలి ?

ప్రస్తుతం పొందుతున్న పింఛను  అనర్హుల నోటీసు అందుకున్న వికలాంగుల పింఛన్దారులు ఆసుపత్రికి వెళ్లకుండా నేరుగా సంబంధిత MPDO / MC వారి వద్ద అప్పీల్ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు అప్పీల్ వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. PD DR&DA వారు GGH & DCHS మెడికల్ సూపరిండెంట్ వారితో కోఆర్డినేట్ అయిన తర్వాత అప్పీల్ చేసుకున్న వారికి మరల షెడ్యూల్ వేస్తారు. అప్పీల్ చేసుకున్న పింఛన్దారులకు మరల రీ అసెస్మెంట్ కొరకు ఆసుపత్రి,  తేదీ,  సమయం తో కూడిన నోటీసు సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వటం జరుగును. ఆయా తేదీల్లో ఫించనుదారులు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది . అప్పుడు డాక్టర్ల పరిశీలన పూర్తయిన తర్వాత మరలా మీకు సదరం శాతం అనేది నిర్ణయించబడుతుంది అప్పటికి కూడా సదరం శాతం అనేది 40% కన్నా తక్కువ ఉంటే వారికి పెన్షన్ అనేది పూర్తిగా రద్దు అవడం జరుగుతుంది. అదే 40% నుండి 85% మధ్య ఉంటే మెడికల్ పింఛన్దారులకు వారి పెన్షన్ రకము మెడికల్ పెన్షన్ నుండి వికలాంగుల పెన్షన్కు మారడం జరుగుతుంది. అదే 85% కంటే ఎక్కువ ఉంటే వారికి మెడికల్ పెన్షన్ అనేది కొనసాగుతుంది అంటే వారికి 15 వేల రూపాయల పెన్షన్ రావడం జరుగుతుంది. అదే వికలాంగులకు పెన్షన్లకు వచ్చినట్లయితే వారికి 40 శాతం తక్కువ ఉంటే పెన్షన్ రద్దు అవడం అదే 40% కన్నా ఎక్కువ ఉంటే వారి పెన్షన్ అనేది యధావిధిగా కొనసాగడం జరుగుతుంది.


ఈ పోస్ట్ నందు కేవలం ఈరోజు వరకు అప్డేట్ అయిన సమాచారం రాయడం జరిగింది. ఇప్పటివరకు మీకేమైనా అర్థం కాకపోయినా లేదా ఇంకా సమాచారం కావాలనుకుంటే క్లుప్తంగా కింద పోస్టులో రాయడం జరిగింది ఒకసారి చదవండి .

Pensoins Cancellation Complete Information

Post a Comment

3 Comments