AP Fee Reimbursement Verification 2025-26: Dates, Portal Link, Process and Required Documents AP Fee Reimbursement Verification 2025-26: Dates, Portal Link, Process and Required Documents

AP Fee Reimbursement Verification 2025-26: Dates, Portal Link, Process and Required Documents

AP Fee Reimbursement 2025-25 AP Fee Reimbursement Verification Process AP Fee Reimbursement Status Check AP Fee Reimbursement Online Application 2025 AP Fee Reimbursement Eligibility 2025 Andhra Pradesh Fee Reimbursement Documents Required AP Post-Matric Scholarship 2025 AP Jnanabhumi Fee Reimbursement AP RTF and MTF Details AP Fee Reimbursement Six Step Verification

 

AP Fee Reimbursement Verification Process 2025-26

AP Post-Matric Scholarship Verification 2025-26 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలేజీలో చదువుతున్న విద్యార్థుల AP Fee Reimbursement పై ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ విడుదల చేసింది. ఎవరైతే కాలేజీ మొదటి సంవత్సరం నుండి చివరి సంవత్సరం వరకు ఈ 2025-26 విద్యా సంవత్సరం లో చదువుతున్నారో వారి AP Fee Reimbursement Verificationను చేయించుకోవలసి ఉంటుంది. ఈ Verification పూర్తి అవ్వని వారికి ప్రభుత్వం నుండి అందే ఉచిత AP Fee Reimbursement అందదు, అప్పుడు తప్పనిసరిగా సొంత డబ్బులతో కాలేజీలకు ఫీజు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి విద్యార్థులు అందరూ కూడా జాగ్రత్తగా ఈ AP Fee Reimbursement Verificationప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. 

AP Fee Reimbursement Online Application 2025

కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల AP Fee Reimbursement కై ముందుగా వారి కాలేజీ ప్రిన్సిపల్ వారి లాగిన్ లో వారి పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ ను చేయించుకోవలసి ఉంటుంది. మొదటి సంవత్సరం చదువుతున్న వారికి పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది రెండవ సంవత్సరం నుంచి చదువుతున్న వారికి గత సంవత్సరం నమోదు చేసిన వివరాలు వెరిఫై చేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ప్రిన్సిపల్ వారు OTA ధ్రువీకరణ చేస్తారు. ఈ రెండు పనులు పూర్తయిన తర్వాత మాత్రమే  విద్యార్థులు ఏ గ్రామ లేదా అవార్డు సచివాలయ పరిధికి వస్తారో ఆ గ్రామా లేదా వార్డు సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ / వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ  వారి లాగిన్ కు Verificationకొరకు వెళ్తాయి. మొదటి రెండు పనులు చేయకుండా పూర్తి అవ్వకుండా మీరు నేరుగా సచివాలయానికి వెళ్ళినట్లయితే Verificationప్రక్రియ పూర్తి అవ్వదు. 


మొదటి సంవత్సరంలో కాలేజీలో జాయిన్ అయిన వారు రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఆ కాలేజీలో సీటు పొందారు వాటి వివరాలు ర్యాంకు కార్డు కాస్ట్ ఇన్కమ్ వివరాలు గతంలో పాసైన సర్టిఫికెట్లు బదిలీ సర్టిఫికెట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రైస్ కార్డు లేదా రేషన్ కార్డు తల్లి మరియు తండ్రి ఆధార్ కార్డు  తల్లి యొక్క బ్యాంకు ఎకౌంటు  పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ ఫారం ఈ వివరాలతో విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతున్నట్లయితే కాలేజీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సంబంధిత ప్రిన్సిపల్ వారు ఓ టి ఏ ధృవీకరణ పూర్తి చేస్తారు అప్పుడు మాత్రమే అప్లికేషన్ విద్యార్థి యొక్క సొంత గ్రామా లేదా వార్డు సచివాలయానికి Verificationకు వెళ్తుంది. రెండవ సంవత్సరం లేదా ఆ పై సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు గతంలో అన్ని వివరాలు ఇచ్చి ఉంటారు కాబట్టి కాలేజీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా అయిపోతుంది తర్వాత సంబంధిత ప్రిన్సిపల్ వారి ఓటీఏ ఆమోదం పొందిన తర్వాత మీ అప్లికేషన్లు మీ సొంత గ్రామా లేదా వార్డు సచివాలయానికి Verificationకొరకు వెళ్తాయి. 


Eligible Courses For AP Fee Reimbursement 

గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారందరూ అర్హులే. ఎవరైతే ఓపెన్ లో గ్రాడ్యుయేషన్ గాని ఓపెన్ గ్రాడ్యుయేషన్ గాని చదివితే వారు అనర్హులు.

పదవ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్, ఒకేషనల్ మినహ మిగిలిన కోర్సులు చదివిన వారందరూ అర్హులే.


AP Fee Reimbursement Six Step Verification

కాలేజీలో రిజిస్ట్రేషన్ మరియు ఓటిఏ ఆమోదం అయిన తర్వాత వెరిఫికేషన్కు మీ సచివాలయానికి మీ దరఖాస్తు వెళ్తుంది అక్కడ గ్రామం అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అధికారి వార్డు అయితే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ అధికారులు మీ Verificationపూర్తి చేస్తారు. Verification సమయంలో తప్పనిసరిగా విద్యార్థులే సచివాలయంలో ఉండాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్కు కావలసిన అవసరమయ్యే డాక్యుమెంట్లు సచివాలయానికి సమర్పిస్తే సరిపోతుంది. ఈ వెరిఫికేషన్కు ఎటువంటి రుసుము ఉండదు ఎవరు కూడా వెరిఫికేషన్కు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సచివాలయంలో వెరిఫికేషన్కు కావలసిన డాక్యుమెంట్లు  


AP Fee Reimbursement Documents

AP Fee Reimbursement Verification Documents Required
  1. Fee Reimbursement Verification Application Form
  2. విద్యార్థి ఆధార్ కార్డు 
  3. కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు 
  4. రైస్ కార్డు 
  5. బ్యాంకు పాస్ బుక్కు తల్లిది 

Download Fee Reimbursement Verification Form

GO/Circular/Memo/Order Name Link
Fee Reimbursement Verification Form Click

AP Fee Reimbursement status check Online

AP Fee Reimbursement Status Check Process

మీ అప్లికేషన్ ఎవరు లాగిన్ లో పెండింగ్ ఉంది ఎవరు ఆమోదం తెలిపారు సచివాలయానికి వెరిఫికేషన్కు వచ్చిందా లేదా సచివాలయంలో Verificationపూర్తి అయిందా లేదా అనే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రతి విద్యార్థికి అవకాశం ఉంది. విద్యార్థి యొక్క కాలేజ్ ఐడి లేదా ఆధార్ కార్డు నెంబర్తో కింద తెలిపిన వెబ్సైట్ నందు లాగిన్ కింద చూపిన విధంగా మీరు స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.

AP Fee Reimbursement Status Link


Post a Comment

7 Comments
  1. ఫ్రెష్ రిఎంబెర్స్మెంట్ సరే...పెండింగ్ ఉన్న వాటి పరిస్థితి ఏంటి..సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు.

    ReplyDelete
    Replies
    1. 2025 lo btech aypoyinawalaki ela?
      Maku certificates, pc emi provide cheydam ledu fee reimbursement pending undi ani

      Delete
  2. ITI students scholarship date please

    ReplyDelete
  3. Application is not dowloading

    ReplyDelete
  4. Last year2024-2025batch valaki fees reimbursement padaledhu
    Ee year padatayi annaru apply chesamu
    Epudu padatayi

    ReplyDelete
  5. Last date for verification in college?

    ReplyDelete
  6. ఇదివరకు పెండింగ్లో ఉన్న వారి పరిస్థితి ఏమిటి క్లారిటీ ఇవ్వండి

    ReplyDelete