AP Smart Ration Card Distribution News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల Smart Ration Card Andhra Pradesh 2025 ఉచిత పంపిణీ కార్యక్రమము AP Smart Ration Card Launch Date ఆగస్టు 25 , 2025 నుండి ప్రారంభం అయింది. ప్రస్తుతం ఉన్న రైస్ కార్డుల స్థానంలో ఇకమీదట కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు ఉన్న ATM కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులను అందరికీ ఉచితంగా ప్రభుత్వం ఇవ్వనుంది. దీనిపై ప్రజాప్రతినిధుల ఫోటోలు ఎవరివి ఉండవు. కేవలం ప్రభుత్వ అధికారిక ఫోటో మరియు కుటుంబ పెద్ద ఫోటో మాత్రమే ఉంటాయి.
ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాప్ లో ఉన్నటువంటి డీలర్లకు రెవెన్యూ సిబ్బంది ద్వారా అందించడం ఉంది. ఆ రేషన్ షాపు ఏ గ్రామా లేదా వార్డు సచివాల పరిధికి వస్తుందో ఆ సచివాలయంలో పనిచేస్తున్న VRO / గ్రామ సర్వేయర్ / మహిళా పోలీస్ / డిజిటల్ అసిస్టెంట్ వారిలో ఒకరిని ఆ FP Shop / షాపు రేషన్ షాప్ కు ట్యాగ్ చేయనున్నారు. రేషన్ డీలర్ వద్ద ePOS మెషిన్ లో కొత్త రేషన్ కార్డులు తీసుకునే సమయంలో సిటిజన్ బయోమెట్రిక్ వేసి కార్డుని పొందాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత సంబంధిత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారి GSWS Employees App లో Rice Card Distribution New అనే ఆప్షన్ లో కార్డు తీసుకున్నట్టు ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది దానికి బయోమెట్రిక్ లేదా ఫేస్ లేదా OTP అయినా సరిపోతుంది. సచివాలయ సిబ్బంది లాగిన్ లో కేవలం కార్డు పొందిన తర్వాత మాత్రమే ధ్రువీకరించాల్సి ఉంటుంది.
AP New Smart Ration Card Details On Card
Data on New AP Smart Rice Card / Ration Card
ప్రభుత్వం కొత్తగా ఇవ్వనున్న AP Smart Rice Card లొ కింద తెలిపిన విషయాలు వివరాలు ఉండనున్నాయి
- బియ్యం కార్డు రకము
- బియ్యం కార్డు నెంబర్
- కుటుంబ పెద్ద పేరు
- కుటుంబ పెద్ద వయసు / పుట్టిన తేదీ
- కుటుంబ పెద్ద లింగము
- కుటుంబ సభ్యుల సంఖ్య
- దుకాణం ఐడి
- దుకాణం చిరునామా
- కుటుంబ సభ్యుల పేరు
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీ / వయసు
- కుటుంబ సభ్యుల లింగము
- కుటుంబ పెద్ద తో సంబంధం
- కుటుంబం శాశ్వత చిరునామా
- తాసిల్దార్ వారి కార్యాలయం పేరు
- ఉచిత టోల్ ఫ్రీ నెంబర్
- పెద్ద ఫోటో [ ఆధార్ కార్డు నుండి తీసుకోబడును ]
- QR Code - రేషన్ సరుకులు, కార్డు స్టేటస్, ఎక్కడ తీసుకున్నారు ఎవరు బయోమెట్రిక్ ద్వారా తీసుకున్నారు, ఏ ఏ సరుకులు తీసుకున్నారు ఎంత మొత్తం తీసుకున్నారు అనే వివరాలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వస్తాయి.
కొత్తగా ప్రభుత్వం కల్పించిన క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డుతో ఇకమీదట ఏ వ్యక్తి ఎక్కడ రేషన్ తీసుకున్నాడు కార్డులో ఎంతమంది ఉన్నారు బోగస్ కార్డు ఉంటే వాటిని అరికట్టడం అర్హులైన ప్రతి కుటుంబానికి సమయానికి రేషన్ అందుతుందా లేదా అని పూర్తి వివరాలు సమయానుసారంగా తెలుసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Andhra Pradesh smart ration card Distribution Schedule
రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు 25 తో ప్రారంభమైనప్పటికీ ఒకే రోజు అన్ని జిల్లాలలో ప్రారంభమవ్వదు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొత్తం నాలుగు దశల్లో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క దశలో కొన్ని జిల్లాలలో పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఏ దశలో ఏ జిల్లాలో పంపిణీ ప్రక్రియ జరుగుతుంది అది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు కొనసాగుతుందో కింద తెలుసుకోండి. మొదటి విడతలో - 53 లక్షలు, రెండోవ విడతలో - 23.70 లక్షలు, మూడవ విడతలో 23 లక్షలు, నాల్గవ విడతలో 46 లక్షలు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ .జిల్లాల వారీగా విడతల వారీగా పంపిణీ కింద చూపిన విధంగా ఉంటుంది. ఆయా జిల్లాలో ఉన్న ప్రజలకు కింద తెలిపిన తేదీలు విడతల వారీగా మాత్రమే ప్రారంభమవుతుంది.
1వ విడత పంపిణి
ఆగస్టు 25 నుంచి
- విజయనగరం
- ఎన్టీఆర్
- తిరుపతి
- విశాఖపట్నం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
- శ్రీకాకుళం
- తూర్పుగోదావరి
- పశ్చిమగోదావరి
- కృష్ణ
2వ విడత పంపిణి
ఆగష్టు 30 నుండి
- చిత్తూరు
- కాకినాడ
- గుంటూరు
- ఏలూరు
3వ విడత పంపిణి
సెప్టెంబర్ 6 నుండి
- అనంతపురం
- అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ
- అనకాపల్లి
4వ విడత పంపిణి
సెప్టెంబర్ 15 నుండి
- బాపట్ల
- పల్నాడు
- వైయస్సార్ కడప
- అన్నమయ్య
- శ్రీ సత్యసాయి
- కర్నూలు
- నంద్యాల
- ప్రకాశం
ఉదాహరణకు ప్రకాశం జిల్లా పంపిణీ సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమవుతుంది వారికి ఈ ఆగస్టు 25 నుండి ప్రారంభమయ్యే వాటిలో ఇవ్వడం జరగదు కేవలం వారికి సెప్టెంబర్ 15 నుండి మాత్రమే కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది.
Rice Card Distribution eKYC in GSWS Employees App
Rice Card Distribution New Report Link
గ్రామ వార్డు సచివాలయాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కార్డులకు ఎన్ని పంపిణీ ప్రక్రియ పూర్తి చేశారు వాటిలో ఎన్నింటికి ఈ కేవైసీ తీసుకున్నారు అని తెలుసుకునేందుకు రిపోర్టు ప్రభుత్వం ఓపెన్ చేయడం జరిగింది కింద లింక్ ఓపెన్ చేసి రిపోర్ట్ తెలుసుకోండి.
AP ration card QR code features
డిజిటల్ ధృవీకరణ: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, లబ్దిదారుడి పూర్తి సమాచారం ration షాపు డీలర్‌కు ట్యాబ్లెట్ లేదా ePOS యంత్రంలో ప్రత్యక్షంగా కనిపించుతుంది. దీనివల్ల ఏ కుటుంబానికి ఎంత సరుకు ఇవ్వాలో స్పష్టంగా తెలుస్తుంది.
సామర్థ్యం & పారదర్శకత: ప్రతి నెల క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సరుకులు ఇస్తారు. ఈ విధానం ద్వారా దొప్పిదాలు, నకిలీ కార్డులు తగ్గాయి, సరైన వారు మాత్రమే లబ్దిదారు అవుతారు.
పర్యవేక్షణ: క్యూఆర్ కోడ్ ద్వారా ప్రభుత్వం, లబ్దిదారి వివరాలు, సరుకుల పంపిణీ వివరాలు, అన్ని లాగ్‌లు ట్రాక్ చేయవచ్చు.
సులభతరం: ప్రజలు శాఖ కార్యాలయాలకు తిరగక్కర్లేదు. సచివాలయం ఉద్యోగులు ఇంటికే వచ్చి కార్డు ఇస్తారు. అక్కడే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ధృవీకరిస్తారు.
నూతన డిజైన్: కార్డుపై లబ్దిదారి ఫోటో, AP రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం & కేవలం క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయి. రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు.
బాధ్యతాయుతానికి సూచన: QR కోడ్ తో లబ్దిదారుల వివరాలు ఒకటుగా ఉండిపోతాయి. పాత కార్డులు రద్దు, కొత్త కార్డులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
సురక్షితత: బహుళ భద్రతా సౌకర్యాలతో-- నకిలీ, మళ్లీ మళ్లీ తీసుకోడం వంటి వంచనలకు తావు ఉండదు.