AP Smart Rice Card Distribution Starts August 25, 2025
AP Smart Ration Card Latest News : ఏపీ ప్రభుత్వం ఆగస్టు 25,2025 నుండి పంపిణీ చేయనున్న AP Smart Ration Cards లో మీ కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబ పెద్ద ఫోటో, పేర్లు, పుట్టిన తేదీలు, బంధుత్వం etc.. తప్పుగా ఉండకుండా సరిగా ప్రింట్ అయి రావాలి అంటే ఇప్పుడు చెప్పనున్న విషయాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. ఎందుకంటే రైస్ కార్డ్ ప్రింటింగ్ గ్రామా లేదా వార్డు సచివాలయ పరిధిలో జరిగి లామినేషన్ చేసి రేషన్ కార్డు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం ATM Card Sized AP Smart Ration Cards ను ప్రజలందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో ప్రభుత్వమే ప్రింట్ చేసి కార్డులనైతే ఇవ్వనుంది. ఒకసారి కార్డు చేరిన తర్వాత కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వాటిని కరెక్షన్ చేసుకున్నప్పటికీ కూడా మరల కార్డు ఎలా వస్తుంది ? ఆర్డర్ పెట్టుకోవాలా ? లేదా ప్రభుత్వమే మరలా ప్రింట్ చేసి ఇస్తుందా ? లేదా గ్రామా లేదా వార్డు సచివాలయాలకు ఆప్షన్ ఇస్తుందా ? అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు.
ప్రస్తుతం మనకున్న అధికారిక సమాచారం మాత్రం ఆగస్టు 25 నుండి రాష్ట్రంలో ఉన్న రైస్ కార్డు కలిగిన అంటే గతంలో రైస్ కార్డు కలిగిన వారు మరియు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకొని ఆమోదమైన వారందరికీ కూడా ప్రభుత్వం ఏటీఎం కార్డు సైజులో ఉండే కుటుంబ పెద్ద ఫోటో మాత్రమే ఉంటూ ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కుటుంబ సభ్యుల వివరాలు వారి పేర్లు, వారి పుట్టిన తే,దీ బంధుత్వం తెలుపుతూ కార్డులను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేయనుంది.
మీకు ప్రభుత్వం ఇవ్వనున్న ఈ AP Smart Ration Card కార్డు రావాలి అంటే మీ కుటుంబ సభ్యులందరి AP Ration Card eKYC తప్పనిసరిగా పూర్తి అయి ఉండాలి . ఇప్పటివరకు దేశంలోని ఎక్కడా లేనివిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 96% ప్రజలకు eKYC అనేది పూర్తవడం జరిగింది.
Know AP Ration Card eKYC Status
ప్రస్తుతం మీ వద్ద ఉన్నటువంటి గత ప్రభుత్వమిచ్చిన రైస్ కార్డులో ఏవైనా తప్పులు అనగా పేరు, పుట్టిన తేదీ, బంధుత్వము, ఇతర వివరాలు ఏవైనా సరే తప్పుగా ఉన్నట్టయితే వాటిని సరి చేసుకునేందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో Change of Details in Rice Card అనే ఆప్షన్ ఇదివరకే ఇవ్వటం జరిగింది. వీలైనంత త్వరగా మీ రైస్ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే వెంటనే మీ యొక్క గ్రామా లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి ఈ ఆప్షన్ ద్వారా రైస్ కార్డు లోని వివరాలను తప్పుగా ఉన్న వాటిని అప్డేట్ చేసుకోండి లేదంటే పాత వివరాలతో కార్డు ప్రింట్ అయి వచ్చే ప్రమాదం ఉంది అలాంటి కార్డు మీకు వచ్చిన ఎటువంటి ఉపయోగం ఉండదు. రేషన్ తీసుకోవడానికి పనికి వచ్చిన ప్రూఫ్ గా ఉపయోగించుకోవడానికి అయితే పనికిరాదు .
మీ గ్రామా లేదా వార్డు సచివాలయంలో రైస్ కార్డు కరెక్షన్ కు వెళ్లే ముందు ప్రస్తుతం మీ కార్డు నందు వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రైస్ కార్డు పై ప్రింట్ అయిన వివరాలు ఈ కేవైసీ చేసిన తర్వాత అప్డేట్ అయ్యే అవకాశం ఉన్నది కావున ఆన్లైన్ లో మీ వివరాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని సరిగా ఉంటే ఎటువంటి అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, అదే తప్పుగా ఉన్నట్టయితే తప్పనిసరిగా మీ గ్రామా లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి అప్డేట్ చేసుకోవడం మంచిది. ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను కానీ ఈ ప్రాసెస్ మీకు కానీ అర్థం కాకపోతే మీరు తప్పనిసరిగా మీ గ్రామ లేదా వార్డు సచివాలయం సందర్శించి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ అధికారి లేదా వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారి వారిని కాంటాక్ట్ అయినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు మరియు రైస్ కార్డు నెంబరు తీసుకొని వెళ్ళినట్లయితే వారు ఆన్లైన్ లో ప్రస్తుత వివరాలు ఎలా ఉన్నాయి అంటే కుటుంబ సభ్యుల పేర్లు, వారి పుట్టిన తేదీలు, వారి యొక్క బంధుత్వం, అంటే కుటుంబ పెద్ద కు మిగిలిన సభ్యులు ఏమవుతున్నారు అనే వివరాలు చూసి చెప్తారు దాని ప్రకారం మీరు అప్డేట్ చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకొని అవసరం అయితే సర్వీసును సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు .
Check AP Rice Card Details Online Process
📱 మీ మొబైల్ లో ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అయిపోండి
ఇక మొదలెడదామా..
⇩
Google లో AEPOS AP అని టైపు చేయండి
epos ap gov in అనే సైట్ వస్తుంది అది ఓపెన్ చేయండి .
⇩
Reports
⇩
MIS
⇩
Ration Card / Rice Card Search
⇩
RC Number - Enter Rice Card Number
⇩
ఇక్కడ చూపిస్తున్నట్టుగా వివరాలు కనిపిస్తాయి ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే సచివాలయాన్ని సందర్శించండి లేదా సచివాలయాన్ని సందర్శించి కూడా ఈ వివరాలను కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ బంధుత్వం ఎలా ఉంది మరియు పుట్టిన తేదీ వంటి వివరాలు కనిపించవు. కావున సచివాలయం సందర్శిస్తే క్లారిటీ వస్తుంది.
⇩
End