Marriage Certificate Registration in Andhra Pradesh
Marriage Certificate in Andhra Pradesh వివాహమైన దంపతులు వివాహ ధ్రువీకరణ పత్రము marriage certificate చేసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. వివాహమైన వెంటనే చాలామంది దీనికి అప్లై చేసుకోవాలంటే పెద్దగా ఆసక్తి చూపించరు, అప్లై చేసుకోవడం వల్ల ఏమైనా డబ్బులు వస్తాయా అనేలా ఆలోచించేవారు కూడా ఉన్నారు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత లేదా మ్యారేజ్ అయిన కొంతకాలం తర్వాత అయినా పర్వాలేదు తప్పనిసరిగా ఈ సర్టిఫికెట్ పొందినట్లయితే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
How to get a marriage certificate in AP ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యారేజ్ సర్టిఫికెట్ను రెండు విధాలుగా పొందవచ్చు. మొదటిది పంచాయతీ కార్యదర్శి / మునిసిపల్ కమిషనర్ వారిచ్చే సర్టిఫికెట్. వివాహం ఎక్కడ అయిందో ఆ పంచాయతీ / వార్డు ఏ గ్రామ / వార్డు సచివాలయ పరిధికి వస్తుందో అక్కడ దరఖాస్తు చేసుకున్న లేదా Manamitra WhatsApp ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామాల్లో అయితే వివాహమైన రోజు నుంచి 2 నెలల లోపు పట్టణాల్లో అయితే వివాహమైన రోజు నుంచి 3 నెలల లోపు దరఖాస్తు చేసుకోవాలి. . రెండవది SRO సర్టిఫికెట్ . పెళ్లయిన మరుసటి రోజు నుంచి ఎప్పుడైనా సరే వారు వివాహం ఏ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధికి వస్తుందో అక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులో మీకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నందు మ్యారేజ్ సర్టిఫికెట్ను ఎలా పొందాలో Sub-Registrar Office Marriage Registration Process పూర్తి సమాచారాన్ని అందించడం జరుగుతుంది .
Uses of a Marriage Certificate in Andhra Pradesh
Marriage Certificate పొందడం వలన కింద తెలిపిన ఉపయోగాలు Uses ఉంటాయి ...
- రేషన్ కార్డులో వివాహమైన మహిళ యాడ్ అవ్వాలి అంటే తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం .
- వీసా మరియు పాస్పోర్ట్ దరఖాస్తు చేయాలి అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం.
- కొన్ని బ్యాంకు ఖాతాలు మరియు ఇన్సూరెన్స్ పాలసీలు తెరవాలి అంటే వివాహన మహిళకు లేదా వివాహమైన వారికి రుజువపత్రంగా మ్యారేజ్ సర్టిఫికెట్ పని చేస్తుంది.
- ఆధార్ కార్డులో ఇంటిపేరు మార్చాలి అంటే ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి .
- ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ సేవలు పొందేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది .
- మ్యారేజ్ సర్టిఫికెట్ POI & POA గా పనిచేస్తుంది .
- పోలీస్ స్టేషన్ మరియు కోర్టు వ్యవహారాలలో లీగల్ డాక్యుమెంట్ గా సర్టిఫికెట్ పనిచేస్తుంది .
- ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భర్త చనిపోయినట్లయితే అర్హత కలిగిన భార్యకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం రావాలి అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి.
- Sposue కోటా కింద ఉద్యోగ బదిలీలు దరఖాస్తు చేసుకోవాలి అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి.
Who is Eligible to Apply for Marriage Certificate in AP?
- పెళ్లి కొడుకు 21 సంవత్సరాలు పెళ్లికూతురు 18 సంవత్సరాలు పూర్తి అవ్వాలి.
- భారతీయులై ఉండాలి.
- వివాహం రాష్ట్రంలో అయి ఉండాలి లేదా భర్త లేదా భార్యలో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి.
- ఇద్దరూ మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ వివాహ సమ్మతికి ఆమోదం తెలిపిన వారే ఉండాలి.
- వివాహం సమయంలో ఇరు పక్షాల వారికి జీవించి ఉన్న జీవిత భాగస్వామి ఉండకూడదు (ద్వివాహం అవ్వకూడదు)
- హిందూ చట్టం ప్రకారం లేదా చట్టం ద్వారా నిర్వచించబడిన నిషేధిత సంబంధాల పరిధిలో ఉండకూడదు.
Where to Apply for a Marriage Certificate in Andhra Pradesh
Marriage Certificate కొరకు దరఖాస్తు చేసే సమయంలో ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెళ్లి ఎక్కడ అయింది అనే స్థానం బట్టి మీరు ఎక్కడ దరఖాస్తు చేయాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ వివాహం ఎక్కడైతే అయిందో ఆ గ్రామం లేదా టౌన్ లేదా సిటీ ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధికి వస్తుందో అక్కడ మాత్రమే మ్యారేజ్ సర్టిఫికెట్ను మీరు పొందాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీ సొంత గ్రామం తిరుపతిలో ఒక గ్రామం అయ్యి మీ వివాహం విజయవాడలో అయినట్టయితే మీరు తిరుపతిలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో దరఖాస్తు చేయకూడదు విజయవాడలో మీ వివాహం ఎక్కడైతే అయ్యిందో ఆ ప్లేస్ ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధికి వస్తుందో అక్కడ మాత్రమే దరఖాస్తు చేయాలి అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారి సంతకంతో మాత్రమే మీకు సర్టిఫికెట్ వస్తే భవిష్యత్తులో మీకు ఎటువంటి సమస్యలు ఉండవు.
చాలామంది వివాహం వేరేచోట అయ్యి సొంత గ్రామంలో అయినట్టు ఫోటోలు తీసుకుని సాక్షులను తీసుకొని సర్టిఫికెట్లు పొందుతూ ఉంటారు అటువంటి వివాహాలపై ఎవరైనా సరే ఫిర్యాదు చేసినట్లయితే సంబంధిత దరఖాస్తుదారులు ఎవరైతే ఆ విధంగా అప్లై చేస్తారో వారు శిక్ష అర్హులు అవుతారు. కాబట్టి అలా చేయకండి. దరఖాస్తు అనేది మీరు ఎక్కడి నుంచైనా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు అది ఎలానో కూడా మీకు ఇదే పోస్టులో చెప్పడం జరుగుతుంది.
ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు వివాహమైన స్థానం ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధికి వస్తుందో ఎలా తెలుసుకోవాలి లేదా మా సొంత గ్రామంలో వివాహం అయితే మా రిజిస్ట్రేషన్ ఆఫీసు ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలి అనే సందేహం వచ్చినవారు కింద ఒకసారి చదవండి.
Locate Your Nearest Sub-Registrar Office in AP
రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కింద ఇవ్వబడిన లింకును ఓపెన్ చేయండి.ఓపెన్ చేసిన తర్వాత జిల్లా, మండలం, గ్రామం ని ఎంచుకున్నట్లయితే
వెంటనే కింద చూపించినట్టుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వివరాలు వస్తాయి.ఆ గ్రామం ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధికి వస్తుందో అక్కడే మీరు సర్టిఫికెట్ను పొందాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ కొరకు మీరు ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు దానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఇక్కడ గ్రామం అంటే ఎక్కడైతే వివాహమైందో ఆస్థానం అని అర్థం.Steps to get Marriage Certificate of Sub Registrar Office (SRO) in Andhra Pradesh
వివాహం పూర్తి
⇩
వివాహం జరిగిన స్థానం రిజిస్ట్రేషన్ ఆఫీస్ తెలుసుకోవడం
⇩
సరైన డాక్యుమెంట్లతో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడం
⇩
ఆన్లైన్లో / SRO ఆఫీసు వద్ద ఫీజు పేమెంట్ చేయడం
⇩
స్లాట్ బుక్ అయిన తేదీ తేదీకు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మరియు ముగ్గురు సాక్షులు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లటం
⇩
ఆఫీసు సిబ్బంది అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు అన్ని సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం
⇩
SRO ఆమోదం తర్వాత సర్టిఫికెట్ పొందడం
Documents Required for Marriage Certificate in AP

- పెళ్లి కార్డు
- పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదా టెన్త్ సర్టిఫికెట్ లేదా పాస్పోర్ట్ లేదా నోటరీ [ భార్య ]
- పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదా టెన్త్ సర్టిఫికెట్ లేదా పాస్పోర్ట్ లేదా నోటరీ [ భర్త ]
- పెళ్లి ఫోటో [ తాళి కడుతున్నట్టుగా ఉంటే మంచిది ]
- భర్త ఫోటో భార్య ఫోటో భర్త
- భర్త ఆధార్ కార్డు
- భార్య ఆధార్ కార్డు
- ఫంక్షన్ హాల్లో పెళ్లయితే రసీదు
- ముగ్గురు సాక్షుల ఆధార్ కార్డులు
- ఫీజు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే రసీదు
Marriage Certificate Application Timings and Office Hours
వివాహమైన మరుసటి రోజు నుంచి ఎప్పుడైనా సరే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నందు మ్యారేజ్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ అంటూ ఏమీ ఉండదు. మనకు నచ్చిన రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లేందుకుగాను ఆన్లైన్ లోనే స్లాట్ బుక్ చేసే సమయంలో నచ్చిన తేదీ నా నచ్చిన సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న తేదీ ఆ సమయానికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మరియు ముగ్గురు సాక్షులు వెళ్లినట్టు అయితే వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వెంటనే లేదా ఒకరోజు లోపు సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ పని చేయు వేళలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5.30 వరకు. ఆదివారం మరియు పబ్లిక్ హాలిడేస్ నాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పనిచేయవు. ఫ్లాట్ బుక్ చేసుకునే సమయంలో సోమవారం శనివారం మినహా మిగతా రోజులు బుక్ చేసుకుంటే మంచిది, క్రౌడ్ తక్కువగా ఉంటుంది.
Marriage Certificate Fees in Andhra Pradesh Sub Registrar Office
Marriage Certificate Fees మ్యారేజ్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేయడానికి స్లాట్ బుకింగ్ సమయంలోనే పేమెంట్ చేయవచ్చు లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కూడా పేమెంట్ అనేది చేయవచ్చు . ఇక్కడ పేమెంట్ Rs.500/- రూపాయలు ఉంటుంది .
Step-by-Step Online Slot Booking Procedure For Marriage Certifiate
ముందుగా కింద అవిబడిన వెబ్సైట్ ని ఓపెన్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ నందు ఆన్లైన్ లో ఉచిత అకౌంట్ లేనివారు ఇక్కడ చూపిస్తున్న New Registration అనే ఆప్షన్ ద్వారా కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలి. గతంలో ఈ వెబ్సైట్ నందు అకౌంట్ ఉన్నవారు నేరుగా యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వవచ్చు.
కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యేందుకు గాను మీ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటిపి పై క్లిక్ చేసినట్లయితే మీ ఇమెయిల్ ఐడి కు ఓటిపి వస్తుంది ఓటీపీని నమోదు చేసిన తర్వాత కింద చూపించినట్టుగా మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ సెట్ చేసుకొని రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. తర్వాత లాగిన్ పేజీకి వెళ్లి మరల మీ ఇమెయిల్ ఐడి ఇప్పుడు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ను నమోదు చేసి లాగిన్ అవ్వాలి .
లాగిన్ అయిన తర్వాత Apply For New Registration అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి . వెంటనే రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది తిరుపతిలో వివాహమైనట్టయితే పైన చూపిస్తున్న పిక్ మార్క్ చేయాలి దేనితో దాన్ని వదిలేసి మిగతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది .
రిజిస్ట్రేషన్ సమయంలో అడిగే వివరాలు
పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఇద్దరికీ సంబంధించి
- ఆధార్ కార్డు నెంబరు మరియు ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ కి వచ్చి OTP
- పూర్తి పేరు [ ఈ వివరాలు సర్టిఫికెట్ వస్తాయి ] పెళ్లికూతురు ఇంటిపేరు మార్చాలి అనుకుంటే ఇక్కడే నమోదు చేయాలి.
- పుట్టిన తేదీ వివరాలు
- పూర్తి చిరునామా
- తల్లి తండ్రి పేర్లు
- మతము
- కులము
- మొబైల్ నెంబరు
- గతంలో విడాకులు అయ్యాయా ? విడాకులు వచ్చినటువంటి తేదీ
- గతంలో వివాహం అయ్యి భర్త లేదా భార్య చనిపోయారా ? చనిపోతే డెత్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి
- వివాహం జరిగిన తేదీ
- వివాహం జరిగిన ప్రదేశం
- ఎన్ని కాపీలు కావాలో నమోదు చేయాలి
- స్లాట్ బుక్ చేయాల్సిన తేదీ సమయం ఎంచుకోవాలి
తర్వాత పైన చెప్పిన డాక్యుమెంట్ అన్ని కూడా ముందుగానే స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి పేమెంటు Rs.500/- చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ,
స్లాట్ బుక్ చేసిన తేదీ సమయానికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ముగ్గురు సాక్షులు వారి యొక్క ఆధార్ కార్డులు, అప్లోడ్ చేసిన అన్ని డాక్యుమెంట్లు రిజిస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు తీసుకొని రావాల్సి ఉంటుంది పట్టుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లినట్లయితే వివరాలన్నీ సరిచూసుకొని డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆమోదం మేరకు సర్టిఫికెట్ అనేది జనరేట్ అయ్యి వెంటనే లేదా ఒకరోజు తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది.
How to Check Marriage Certificate Application Status Online
ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసిన తేదీ సమయానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళినట్లయితే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది, ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదు కానీ స్లాట్ బుక్ చేసిన సమయంలో లాగిన్ లో కంప్లీట్, రిజెక్టెడ్ అనేవి చూపిస్తాయి. కంప్లీట్ అయితే సర్టిఫికెట్ అయినట్టు లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్టు అర్థము అదే పెండింగ్ చూపించినట్టయితే దరఖాస్తు చేసిన అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎటువంటి ప్రాసెస్ అవ్వలేదు అని అర్థం .
How to Download Andhra Pradesh Marriage Certificate PDF
రిజిస్ట్రేషన్ ఆఫీసులో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ మాన్యువల్ గా ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే లేదు కానీ కొత్తగా ఇచ్చినటువంటి మ్యారేజ్ సర్టిఫికెట్లు పైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లయితే ఆన్లైన్ లో మరలా అదే సర్టిఫికెట్ చూపించడం జరుగుతుంది దానిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్నట్లయితే సరిపోతుంది.