Annadata Sukhibhava Payment Not Received ?
2nd August 2025 నాడు Annadata Sukhibhava Scheme 1st Installment Payment Rs. 5000/- ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాలో విడుదల చేయడం జరిగింది. వివిధ కారణాల వలన చాలామంది రైతులకు Payment Not Received పేమెంట్ పడలేదు. అసలు ఏఏ కారణాల Reasons వలన నగదు క్రెడిట్ అవ్వకపోవచ్చు నగదు ఎందుకు క్రెడిట్ అవ్వలేదు ఎలా తెలుసుకోవాలి, పేమెంట్ కు సంబంధించి అర్జీ Grievance ఎలా నమోదు చేయాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Check Annadata Sukhibava Payment Status Online
మొదటి విడత అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ తెలుసుకునేందుకు కింద ఇచ్చిన వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
Check Annadata Sukhibava Payment Status
రైతు యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేసి పక్కనే కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే రైతు యొక్క పేమెంట్ స్టేటస్ మరియు అప్లికేషన్ స్టేటస్ వివరాలు చూపిస్తుంది. పేమెంట్ క్రెడిట్ అయినట్టు అయితే ఏ బ్యాంకుకు ఎంత నగదు క్రెడిట్ అయింది అనే విషయాలు క్లియర్ గా కనిపిస్తాయి. పేమెంట్ అవ్వకపోతే పక్కనే ఎందుకు అవ్వలేదు అనే విషయం కూడా తెలుస్తుంది. ఇక్కడ నేను చెప్తున్న విషయం మీకు సరిగా అర్థం కాకపోతే మీరు మీ సంబంధిత రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి అక్కడ పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ కార్యదర్శి అధికారులను అన్నదాత సుఖీభవ లేదా పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ అవ్వకపోవడానికి గల కారణం తెలుసుకొని వారు చెప్పే పరిష్కారాన్ని మీరు ఫాలో అయినట్లయితే మీకు నగదు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది.
Annadata Sukhibava Scheme Ineligible Reasons
- ఈకేవైసీ పూర్తి చేయని రైతులు
- భూమి యజమానులు మరణించిన రైతుల పేర్లు జాబితాలో లేకపోవడం
- వారసులకు పాసుపుస్తకాలు జారీ కాకపోవడం
- భూమికి ఆధార్ లింకింగ్ సమస్యలు
- ఎన్‌పీసీఐ అకౌంట్ యాక్టివ్ కాకపోవడం
- వ్యవసాయేతర భూములు (అక్వా సాగు, నిర్మాణ భూములు)
- ప్రస్తుత లేదా మాజీ ప్రజాప్రతినిధులు
- ₹20,000 కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు
- 10 సెంట్ల కంటే తక్కువ భూమి కలిగిన వారు
- మైనర్‌లు
Annadata Sukhibava Payment Not Received Reasons - Solutions
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు మొదటి విడత నగదు క్రెడిట్ అవ్వక పోవడానికి గల కారణాలు - ఏం చేస్తే క్రెడిట్ అవుతాయో పరిష్కారం ఇక్కడ తెలియజేయడం జరిగింది.
1. Name Correction
ఉన్న భూమికి ఆధార్ కార్డు నెంబరు కరెక్ట్ గా లింక్ అయినప్పటికీ 1B లో ఉన్న పేరుకు మరియు అర్హుల జాబితాలో వచ్చిన పేరుకు చిన్న స్పెల్లింగ్ తేడా ఉన్నట్టయితే వారికి నగదు క్రెడిట్ అవ్వదు. అటువంటి వారికి నేరుగా వారి మండల తాసిల్దారు వారి లాగిన్ లోనే పేరుని ధ్రువాకరించే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సంబంధిత సృజన్ ఎవరైతే ఉంటారో వారు వారి సచివాలయంలో పేరును కరెక్షన్ చేసుకునేందుకుగాను Mutation For Correction అనే ఆప్షన్ ద్వారా సర్వీసుకు దరఖాస్తు చేయాలి.
2. Wrong Aadhaar Seeding
ప్రభుత్వ వెబ్లాండ్ రికార్డుల ప్రకారం ఆధార్ కార్డు నెంబరు రైతు యొక్క ఆధార్ కార్డు నెంబరు పూర్తిగా వేరుగా ఉంటే ఈ సమస్య వస్తుంది. ఇటువంటి సమస్య ఉన్నవారు వెంటనే వారి సచివాలయంలో లేదా మీసావ ద్వారా పట్టాదార్ ఆధార్ సీడింగ్ అనే సర్వీసును దరఖాస్తు చేసి సంబంధిత VRO మరియు MRO వారి ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంటుంది.
3. Institutional Pattadar Names
రైతు పేరుకు బదులు గుడి, కంపెనీ, ఏదైనా బోర్డు లేదా ఇతర పేర్లు ఉన్నట్టయితే వారికి ఈ సమస్య చూపిస్తుంది. అటువంటి వాటిని ADSB వెబ్సైట్ నందు రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు సంబంధిత తాసిల్దార్ వారి లాగిన్ లో " Institutional Lands Under The Reason For Rejection" ఇవ్వటం జరుగుతుంది.
4. Joint Khata Single - Aadhar seeded
భూమి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు పంచుకున్నప్పటికీ ఒకరి మాత్రమే ఆధార్ కార్డు నెంబరు సీడ్ అయినట్టు అయితే వారికి సమస్య వస్తుంది. అటువంటివి తాసిల్దారు వారు వెరిఫికేషన్ చేసిన తర్వాత భూమి జాయింట్ అయినప్పటికీ ఆధార్ ఒకరిదే లింక్ అయిందని తాసిల్దారు నిర్ధారణకు వచ్చిన తర్వాత వారి లాగిన్ లో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. Reason for approval లో తాసిల్దార్ వారికి Joint Khata అనే ఆప్షన్ ద్వారా ఆమోదిస్తారు .
5. Non agricultural activity
వ్యవసాయ భూమి వ్యవసాయతర పనులు అనగా ఇంటి పట్టాలు, ఆక్వా కల్చర్ లేదా ఇతర పనులకు వాడుతున్నట్టయితే వారికి ఈ సమస్య వస్తుంది. ఇటువంటి వారికి నగదు క్రెడిట్ అవదు కాబట్టి ADSB వెబ్సైట్ నందు తాసిల్దార్ లాగిన్ "Non Agriculture Activity" లో ఇవి రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది.
6. Permanent Migration
రైతు శాశ్వత వలసలు ఉన్నట్టయితే ఈ సమస్య వస్తుంది. వీరికి నగదు క్రెడిట్ అవ్వదు కాబట్టి సంబంధిత తహసిల్దారు వారి లాగిన్ లో "Permanent Migration" లొ "Forward to MAO" అనే ఆప్షన్ తో సబ్మిట్ చేయడం జరుగుతుంది.
7. Wrong Aadhaar With Notional Khata
వెబ్ ల్యాండ్ లో ఉన్న వివరాలకు ఆధార్ నెంబరు పూర్తిగా తప్పుగా ఉన్నట్టయితే మరియు నోషనల్ ఖాతా ప్రస్తుతమున్న ఖాతాలో కూడా ఆధార్ వివరాలు తప్పుగా ఉంటే ఈ సమస్య వస్తుంది. VRO వారు తనిఖీ చేసిన వివరాలను తాసిల్దారి వారి ద్వారా జాయింట్ కలెక్టర్ వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. Suo-moto Module ద్వారా JC వారు సంబంధిత తాసిల్దార్ వారికి నోషనల్ ఖాతా మరియు ఆధార్ వివరాలను సరి చేసేందుకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.
8. Unseeded Aadhar Numbers
ఇప్పటివరకు ఆధార్ నెంబరు సీడ్ అవ్వకపోతే ఈ సమస్య వస్తుంది. సంబంధిత రైతు సేవ కేంద్రంలో ఆధార్ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది అది లింక్ అయిన తర్వాత మాత్రమే వారికి పేమెంట్ అనేది ప్రాసెస్ మొదలవుతుంది.
9. Deceased Aadhar Seeded to Active 1B Khata
చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ నెంబరు ప్రస్తుతం బతికి ఉన్న భూమి కలిగిన వేరొక 1 బి రికార్డుకు లింక్ అయితే ఈ సమస్య వస్తుంది. సచివాలయంలో లేదా మీ సేవలో ఆధార్ సీడింగ్ ఆప్షన్ ద్వారా Fresh Aadhar Seeding చేస్తే ఈ సమస్య క్లియర్ అవుతుంది.
10. Pattadar Deceased and his/her Aadhar Wrongly Seeded
భూమి కలిగిన రైతు చనిపోయినట్లయితే తప్పనిసరిగా వారి ఇంట్లో వారు మిటేషన్ చేసుకొని ఆ భూమిని ఇంట్లో వారి పేరుపై మార్చుకోవాల్సి ఉంటుంది.
11. Succession Disputs - Civil Litigation
కుటుంబ తగువులు, వారసత్వంగా భూమి మార్పు విషయంలో ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే వారికి నగదు క్రెడిట్ అవ్వదు. ఆ సమస్య లీగల్ గా క్లియర్ అయ్యేవరకు వారి దరఖాస్తులు Reject లొ ఉంటాయి..
12. Ineligble
పథకానికి సంబంధించి అనర్హులు అని అర్థము. అర్హులైన కూడా అనర్హులు అని వస్తే వెంటనే మీ సమీప రైతు సేవా కేంద్రాన్ని [ Raithu Seva Kendram - గతంలో Raithu Bharosa Kendrsm ] సందర్శించి అక్కడున్న అధికారులకు అర్జీను పెట్టుకోండి
13. NPCI InActive
ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా లింక్ లేనప్పుడు ఈ విధమైన సమస్య వస్తుంది ఈ సమస్య వచ్చిన వారు వెంటనే మీ సమీప సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఆధార్ కార్డుకు లింక్ చేస్తూ కొత్త బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయండి లేదా గతంలో మీకు బ్యాంకు ఖాతా ఉన్నట్టయితే ఆ యొక్క బ్యాంకు సందర్శించి ఆధార్ కార్డును సమర్పించి ఎంపీ సీలింగ్ చేయించండి ఆన్లైన్లో సొంతంగా చేసుకునే ఆప్షన్ కూడా ఉంది కానీ దానివలన లింక్ అవ్వకపోతే మరల మీకు సమస్య వస్తుంది పేమెంట్ అనేది అవ్వదు కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.
14. eKYC Not Done
గత ఐదు సంవత్సరాలలో రైతు ఎక్కడైనా సరే ప్రభుత్వం పరంగా ఈకేవైసి అదే బయోమెట్రిక్ వేసి ఉన్నట్లయితే వాటిని పరిగణలోకి తీసుకొని ఈ కేవైసీ పూర్తయినట్టు ప్రభుత్వం పరిగణించింది కాబట్టి 99% రైతులకు ఈ కేవైసీ సమస్య అనేది ఉండదు అయినప్పటికీ ఈ కేవైసీ సమస్య వలన ఈ పథకానికి సంబంధించి నగదు క్రెడిట్ అవ్వకపోతే వెంటనే రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి పూర్తి చేసుకోవచ్చు.
15. One Credited Other Not
చాలామందికి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ సంబంధించి ఒక పథకం నగదు పడితే ఇంకొక పథకం నగదు పడటం లేదు. అటువంటివారు ఒక వారం నుండి పది రోజులు వెయిట్ చేయండి అప్పటికి నగదు క్రెడిట్ అవ్వకపోతే పైన చెప్పిన స్టేటస్ చెక్ చేసుకొని అందులో ఏదైనా సరే రిమార్క్ వచ్చిందో లేదో చూసుకోండి దాని అనుగుణంగా బ్యాంకు ఖాతా లింకు లేదా ఈ కేవైసీ అవ్వలేదా అర్హులు కాదా లేదా ఇతర ఇతర సమస్యలే ఉన్నా సరే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మీకు ఈ విషయంపై అప్పటికి క్లారిటీ రాకపోతే రైతు సేవ కేంద్రంలో ఉన్న అధికారులను కాంటాక్ట్ అవ్వండి .