Member Adding in Ration Card – Complete Process 2025
Ration Card Member Addition - రేషన్ కార్డులో సభ్యుల చేర్పు పూర్తి ప్రాసెస్ .. మీ ఇంట్లో రేషన్ తీసుకోకుండా ఎవరైనా ఉంటే వారిని వెంటనే AP Ration Cardలో చేర్పించండి. AP Ration Cardలో సభ్యుల చేర్పుకు ప్రభుత్వం అవకాశం ఇది వరకే కల్పించి ఉన్నది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం పాటు ఎటువంటి AP Ration Cardల పై అప్డేట్ లేదు అంటే AP Ration Cardలో సభ్యుల చేర్పు మార్పులకు అవకాశం కల్పించలేదు ఇప్పుడు AP Ration Cardలో సభ్యుల చేర్పు , AP Ration Cardలు వివరాలు మార్పుకు అవకాశం ఉంది. AP Ration Cardలో సభ్యుల చేర్పులో ముఖ్యంగా పుట్టిన పిల్లలకు AP Ration Cardలొ చేర్చేందుకు మరియు వివాహమైన మహిళ అత్తవారి లేదా భర్త AP Ration Cardలో చర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించింది.
Documents Required for Adding New Member in Ration Card
పుట్టిన పిల్లలు AP Ration Cardలో చేర్పించాలి అంటే తప్పనిసరిగా పుట్టిన తేదీ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. అదే వివాహమైన మహిళ అత్తవారింట్లో లేదా భర్త AP Ration Cardలో చేరాలి అంటే ఎటువంటి Marriage Certificate అవసరం లేకుండానే AP Ration Cardలో చేరవచ్చు. వివాహమైన మహిళ ఆధార్ కార్డ్ చిరునామాలొ కేరాఫ్ లొ తండ్రి పేరు బదులుగా భర్త పేరు మార్చాల్సి ఉండాల్సి ఉంటుంది. AP Household Mapping Change తోపాటు AP Ration Cardలో సభ్యుల చేర్పు Ration Card Member Adding Application Form , ప్రస్తుతం AP Ration Card ఎవరి పేరు పై ఉందో AP Ration Card జిరాక్స్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్ లు దరఖాస్తు చేసే సమయంలో అవసరం పడతాయి.
Ration Card Member Adding Process
దరఖాస్తుకు AP Mee Seva లేదా Manamitra WhatsApp Governance లో అవకాశం లేదు. కేవలం హౌస్ మ్యాపింగ్ ఎక్కడ అయితే ఉందో ఆ గ్రామ లేదా వార్డులో ఉన్నటువంటి Grama Ward Sachivalayam లో ఉన్న Digital Assistant అధికారి లేదా Ward Education and Data Processing Secretary అధికారి వారి వద్ద దరఖాస్తు సమర్పించాల్సి. సంబంధిత అధికారులు డాక్యుమెంట్లను పరిశీలించి దరఖాస్తును వారి లాగిన్ లో సమర్పిస్తారు. AP Ration Cardలో సభ్యుల చేర్పు కొరకు దరఖాస్తు సమర్పించిన తర్వాత సంబంధిత దరఖాస్తుదారులు Ration Card Member Adding Receipt ను పొందాల్సి ఉంటుంది. రసీదులో Application Number ఉంటుంది ఆ నెంబర్తో Ration Card eKYC ప్రక్రియ పూర్తి చేయాలి. eKYC ను రాష్ట్రంలో ఉన్న ఏ గ్రామ లేదా వార్డు సచివాలయ ఉద్యోగుల మొబైల్ యాప్ GSWS Employees App లొ చేయవచ్చు. పుట్టిన పిల్లలకు ఈ కేవైసీ స్థానంలో తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల బయోమెట్రిక్ లేదా ఓటీపీతో అవుతుంది. వివాహమైన మహిళ eKYC స్థానంలో మహిళ బయోమెట్రిక్ లేదా ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చే OTP చెప్పిన సరిపోతుంది. AP Ration Cardలో చేరుస్తున్నటువంటి సభ్యులతో పాటు గతంలో AP Ration Cardలో ఉంటూ ఈ కేవైసీ అవ్వని వారు కూడా ఇప్పుడుeKYC సమయంలో వారి బయోమెట్రిక్ లేదా ఆధార్ ఓటిపి ద్వారా eKYC ప్రక్రియ సంబంధిత గ్రామాల వార్డు సచివాలయం ఉద్యోగుల్లో వద్ద చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత దరఖాస్తు రెవెన్యూ అధికారుల వారి లాగిన్ కు వెళ్తుంది గ్రామాల్లో Village Revenue Officer VRO వార్డులో Ward Revenue Secretary WRS వారి లాగిన్ కు వెళ్తుంది. Six Step Validation కూడా Automatic అనగా Six Step Validationలో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా ఆటోమేటిక్గా వివరాలు వీరి లాగిన్ లో చూపిస్తాయి. అన్ని సరిగా ఉంటే వారి లాగిన్ లో ఆమోదం తెలుపుతారు Six Step Validationలో దరఖాస్తుదారులు అనర్హులుగా తేలితే అప్లికేషన్ ఇక్కడితో రిజెక్ట్ లేదా రద్దు అవుతుంది. సంబంధిత గ్రామ / వార్డు రెవెన్యూ అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత దరఖాస్తు తుది ఆమోదం కొరకు సంబంధించిన Tahsildar వారు లాగిన్ కు వెళ్తుంది. గ్రామ వార్డు రెవెన్యూ అధికారుల ఆ రిమార్కుల మేరకు తాసిల్దార్ వారు అప్లికేషన్ను తుది ఆమోదం తెలుపుతారు.
Application Fee For Ration Card Member Adding
దరఖాస్తు చేయడానికి AP Ration Card Member Adding Fee Rs.24/- ఉంటుంది.Cash / UPI రెండు విధములుగా పేమెంట్ చెయ్యవచ్చు . Ration Card eKYC కొరకు గానీ లేదా గ్రామ / వార్డు రెవెన్యూ అధికారులు లేదా తాసిల్దారు వారి ఆమోదం కొరకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. AP Ration Card Member Adding Fee కూడా సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి లేదా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారి వారు దరఖాస్తు చేసే సమయంలోనే సమర్పించాల్సి ఉంటుంది. కొత్త AP Ration Card కోసం లేదా ఇతర సర్వీస్ ఛార్జ్ కోసం ఎటువంటి అదనపు నగదు సమర్పించాల్సిన పనిలేదు.
Processing Time - SLA Period For Member Adding in AP Ration Card
దరఖాస్తు సమర్పించిన తేదీ నుండి 21 Days లోపు సంబంధిత కొత్తగా AP Ration Card Adding ప్రక్రియ పూర్తి అవుతుంది దరఖాస్తు చేసిన రోజు నుంచి నాలుగు రోజులలోపు eKYC ప్రక్రియ తర్వాత ఏడు రోజులలోపు గ్రామ వార్డు రెవెన్యూ అధికారుల వారి లాగిన్ లో ఆమోదం మిగిలిన రోజుల్లో సంబంధిత తహసిల్దార్ వారు లాగిన్ లో ఆమోదం అప్లికేషన్ పొందాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా 21 రోజులలోపు ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది.
How to Download new AP Ration Card pdf ?
దరఖాస్తు సంబంధిత తాసిల్దార్ వారు లాగిన్ లో ఆమోదం పొందిన తర్వాత తదుపరి నెలలో సంబంధిత వ్యక్తులకు రేషన్ డీలర్ వద్ద రేషన్ వస్తుంది. AP Ration Card మాత్రం వెంటనే రాదు గతంలో నేరుగా గ్రామ వార్డు రెవెన్యూ అధికారుల వారి లాగిన్ లో రైస్ కార్డు ప్రింట్ ఆప్షన్ ఉండేది కానీ ఇప్పుడు అది తీసేశారు.. కొత్తగా జోడించిన సభ్యులతో AP Ration Card కొత్తది కావాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా ప్రింట్ అయి పివిసి కార్డు రూపంలో ఉన్న స్మార్ట్ AP Ration Card నేరుగా ప్రభుత్వం నుండి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సంబంధిత వ్యక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఒకటే విన్నపం ఏంటంటే AP Ration Card ప్రింట్ అయి వచ్చే ముందే AP Ration Cardల వివరాలు అనగా పేర్లు బంధుత్వాలు పుట్టిన తేదీలు వంటి వివరాలు సరిగా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి సరిగా లేకపోతే మీ మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో AP Ration Cardలు వివరాల మార్పు కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. AP Ration Cardలో ఎవరైనా చనిపోయిన వారు ఉన్నా లేదా శాశ్వత వలస శాశ్వత చదువు శాశ్వత వృత్తిరీత్యా బయట రాష్ట్రాలు లేదా దేశాలలో పనిచేస్తున్న వారిని కార్డు నుంచి తొలగించాల్సి ఉంటుంది అప్పుడే ప్రస్తుతం కార్డులో ఉంటూ రేషన్ తీసుకుంటూ ఉన్న సభ్యుల పేర్లతో మాత్రమే కొత్త స్మార్ట్ AP Ration Card అనేది వస్తుంది.
పై ప్రాసెస్ ద్వారా కొత్తగా వివాహమైన మహిళలు వారి కన్నవారి ఇంటి నుండి అత్తవారింటికి AP Ration Cardలో చేరగలరు. ఈ ప్రక్రియ మొత్తంలో కన్నవారి ఇంటి వద్ద ముందుగా డిలీట్ అవ్వాల్సిన అవసరం లేదు నేరుగా అత్తవారింట్లో లేదా భర్త AP Ration Cardలో పేరు నమోదైన వెంటనే కన్నవారింటి AP Ration Cardలో లేదా గతంలో మీరు ఏ AP Ration Cardలు ఉంటే అక్కడ పేరు డిలీట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం చివరి తేదీ అంటూ లేకుండా ఈ ప్రక్రియ కొనసాగుతుంది అశ్రద్ధ వహించకండి ఎందుకంటే AP Ration Cardల ప్రక్రియ చాలా సున్నితంగా ఉంటుంది అనగా ఏదైనా ఎలక్షన్ కోడ్ వచ్చిన లేదా ప్రభుత్వాలు మారిన లేదా ఆపత్కర పరిస్థితిలో వచ్చిన ఈ ప్రక్రియ నిలుపుదల చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అప్లికేషన్ ఓపెన్ గా ఉన్నప్పుడు వెంటనే దరఖాస్తు చేసుకొని AP Ration Cardలో ఆడ్ అవ్వండి.
How to Check Status of Member Addition in Ration Card
AP Seva Portal వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ స్టేటస్ లో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ప్రస్తుతం అప్లికేషన్ ఏ స్థాయిలో ఉంది అంటే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిందా? గ్రామ లేదా వార్డు రెవెన్యూ అధికారులు ఆమోదం తెలిపారు తాసిల్దారు వారు ఆమోదం తెలిపారు పెండింగ్లో ఉంచారా లేదా రిజెక్ట్ చేశారా అనే పూర్తి వివరాలు తెలుస్తాయి చివరగా తాసిల్దారు వారి ఆమోదం పూర్తయిన వెంటనే తదుపరి నెల నుండి రేషన్ రావడం జరుగుతుంది.
T255134159
ReplyDelete