AP Pension Latest Updates 2025
నవంబర్ నెల పింఛన్ పంపిణీ నవంబర్ 1 శనివారం మరియు నవంబర్ 3 సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాల సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ దారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. పింఛను పంపిణీ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది నవంబర్ 3 తో పింఛన్ పంపిణీ కార్యక్రమం ముగుస్తుంది.
Latest Mobile Apps Useful for GSWS Employees During Pension Distribution
| App Name | Download Link |
|---|---|
| | Download |
| | Download |
| | Download |
| | Download |
| | Open |
| | Download |
📋 Important Guidelines for Village and Ward Secretariat Staff During Pension Distribution
ఆంధ్రప్రదేశ్ పింఛన్ పంపిణీ 2025లో గ్రామ–వార్డు సచివాలయ సిబ్బంది ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. పింఛన్ పంపిణీ సమయాల్లో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటిస్తే పనులు సజావుగా సాగుతాయి మరియు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది.
🕖 పింఛన్ పంపిణీ సమయం
- పింఛన్ పంపిణీ ఉదయం 7 గంటలకు అధికారికంగా ప్రారంభం అవుతుంది.
- మొబైల్ యాప్‌లో ఉదయం 6:30 నుంచే పేమెంట్ సేకరణ ప్రారంభమవుతుంది. అంతకంటే ముందుగా యాప్‌లో పేమెంట్లు చేయడం సాధ్యం కాదు.
🧾 కొత్త పింఛన్లకు కేవైసీ తప్పనిసరి
- కొత్త వితంతు పింఛన్లు (SPAS) లేదా ఇతర కొత్త పింఛన్లకు ముందుగా KYC పూర్తి చేసి తర్వాత మాత్రమే పేమెంట్ చేయాలి.
📱 మొబైల్ యాప్ మరియు టెక్నికల్ సిద్ధత
- పింఛన్ పంపిణీకి ముందు రోజు మొబైల్‌ను పూర్తిగా చార్జ్ చేసుకోవాలి.
- GSWS లేదా పింఛన్ యాప్ తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అయ్యి పేమెంట్ వివరాలు సరిచూడాలి.
💵 నగదు లెక్కింపు & జాగ్రత్తలు
- పేమెంట్ సమయంలో ఆతురపడకుండా నిదానంగా ఒక్కొక్కరిగా చేయాలి.
- నగదు లెక్కింపు తప్పక రెండుసార్లు చేయాలి. పొరపాట్లు సిబ్బందికే నష్టం అవుతాయి.
- వీలైతే ముందురోజే నగదును ₹4000, ₹6000, ₹10000 వేర్వేరుగా విభజించి సిద్ధం చేసుకోవాలి.
- పింఛన్ ఇస్తున్నప్పుడు పింఛనుదారునే మీ ముందు నగదు లెక్కించమని చెప్పాలి, తద్వారా ఎటువంటి అనుమానాలు లేకుండా ఉంటుంది.
👁️ బయోమెట్రిక్, ఫేస్ & ఐరిస్ ధ్రువీకరణ
- బయోమెట్రిక్ పనిచేయని వారికి చివర్లో పేమెంట్ ప్రయత్నించాలి.
- అవసరమైతే వారికి RBIS రిజిస్ట్రేషన్ చేయాలి.
- బయోమెట్రిక్ సరిగా రాకపోతే ఫేస్ ఆథెంటికేషన్ చేయాలి.
- చలికాలంలో వేలిముద్రలు సరిగా పడకపోతే పౌడర్ లేదా లిక్విడ్ వాడి ప్రయత్నించాలి.
- బయోమెట్రిక్ పనిచేయని వారు సమీప ఆధార్ సెంటర్లో బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించాలి.
⚠️ మరణించిన పింఛనుదారుల వివరాలు
- ఎవరైనా పింఛనుదారుడు మరణించినట్లయితే తప్పనిసరిగా రికార్డు చేయాలి.
- ఆయన భార్య (లేదా భర్త) ఆధార్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్ వివరాలు నమోదు చేయాలి.
- మరణ ధృవపత్రం (Death Certificate) తీసుకుని సంబంధిత వెల్ఫేర్ సహాయకులకు అందజేయాలి.
🆕 కొత్త పింఛన్ల పంపిణీ
- కొత్తగా మంజూరైన పింఛన్లు అధికారుల అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వాలి.
- పింఛన్ పంపిణీ సమయంలో ఎవరితోనూ వాగ్వాదం లేదా గొడవలకు దిగరాదు.
- మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వక వాతావరణంలో పింఛన్ ఇవ్వాలి.
- పింఛన్ పూర్తయిన వెంటనే నగదు సచివాలయ వెల్ఫేర్ సహాయకులకు అప్పగించాలి, వారు రెండు రోజుల్లో ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు.
- పింఛన్ నగదును ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడరాదు, అలా చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు.
📜 Andhra Pradesh Pension Rules 2025 – Complete Information
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ పంపిణీను పారదర్శకంగా నిర్వహిస్తోంది. 2025లో అమలులో ఉన్న AP Pension Distribution Rules ప్రకారం, ప్రతి నెలలో పింఛన్ మొదటి రెండు రోజుల్లో మాత్రమే పంపిణీ చేయబడుతుంది.
1. పింఛన్ పంపిణీ తేదీలు:
మొదటి రోజు సెలవు అయితే — గత నెల చివరి వర్కింగ్ డేలో పింఛన్ పంపిణీ
రెండవ రోజు సెలవు అయితే — మూడవ తేదీన పింఛన్ పంపిణీ
మొదటి రెండు రోజులు వర్కింగ్ డేస్‌గా ఉన్నప్పుడు — ఆ రెండు రోజుల్లోనే పూర్తిగా పింఛన్ పంపిణీ
గమనిక: సాధారణ పరిస్థితుల్లో మూడవ రోజు తర్వాత పింఛన్ ఇవ్వబడదు. ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే మినహాయింపు ఉంటుంది.
2. మిస్ అయిన పింఛన్ రూల్స్ (Missed Pension Rules in AP)
ఒక నెల పింఛన్ మిస్ అయితే — తర్వాతి నెలలో రెండు నెలల పింఛన్ ఒకేసారి పొందవచ్చు.
రెండు నెలలు మిస్ అయితే — మూడో నెలలో మూడు నెలల పింఛన్ అందుతుంది.
మూడు నెలలు వరుసగా పింఛన్ తీసుకోకపోతే — ఆ పింఛన్ తాత్కాలికంగా హోల్డ్ అవుతుంది.
3. హోల్డ్ అయిన పింఛన్ పునరుద్ధరణకు:
📍 సంబంధిత MPDO / మున్సిపల్ కమిషనర్ వద్ద దరఖాస్తు చేయాలి. పరిశీలన అనంతరం పింఛన్ పునరుద్ధరించబడుతుంది కానీ గత నెలల పెండింగ్ పింఛన్ అందదు.
4. కొత్త దరఖాస్తులు & వితంతు పింఛన్ (Widow Pension in AP)
ప్రస్తుతం కొత్త పింఛన్ దరఖాస్తులు స్వీకరించడం లేదు. అయితే భర్త మరణించిన సందర్భంలో భార్య వితంతు పింఛన్ (Widow Pension) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
📍 దరఖాస్తు చేయాల్సిన స్థలం: గ్రామ/వార్డు సచివాలయం
5. పింఛన్ బదిలీ (Pension Transfer in AP)
పింఛనుదారుడు ప్రాంతం మార్చినప్పుడు పింఛన్ బదిలీ చేసుకోవచ్చు. మూడవ తేదీ తర్వాత వెల్ఫేర్ సహాయకుడు / సచివాలయ అధికారిని సంప్రదించడం ద్వారా బదిలీ ప్రక్రియ జరగుతుంది.
6. బయోమెట్రిక్ సమస్యలు (Biometric Issue During Pension)
పింఛన్ తీసుకునే సమయంలో బయోమెట్రిక్ పనిచేయకపోతే 📍 సమీప ఆధార్ సెంటర్లో బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలి. దీనివల్ల తర్వాతి నెలల్లో పింఛన్ సులభంగా పొందవచ్చు.
7. వెరిఫికేషన్ అవ్వని వారికీ
వివిధ కారణాల వలన ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల రీ వెరిఫికేషన్ లో భాగంగా నోటీసులు అందుకొని వారు, అందుకొని వెరిఫికేషన్కు వెళ్ళని వారికి మరియు అర్హతకు మించి తక్కువ సదరం శాతం వచ్చిన వారికి కూడా ప్రభుత్వం 2025వ సంవత్సరం నవంబర్ నెల కూడా పింఛను కొనసాగిస్తుంది.
📜 Andhra Pradesh Pension Enhancement Rates 2025 (AP Pension New Rates List in Telugu)
| S.No. | Category | Present Rate (₹) | Enhanced Rate (₹) |
|---|---|---|---|
| I. Enhancement of Pension from ₹3000 to ₹4000 | |||
| 1 | వృద్ధాప్య పెన్షన్ | 3000 | 4000 |
| 2 | వితంతువు | 3000 | 4000 |
| 3 | చేనేత కార్మికులు | 3000 | 4000 |
| 4 | కల్లు టాప్పర్స్ | 3000 | 4000 |
| 5 | మత్స్యకారులు | 3000 | 4000 |
| 6 | ఒంటరి మహిళలు | 3000 | 4000 |
| 7 | సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు | 3000 | 4000 |
| 8 | ట్రాన్స్ జెండర్ | 3000 | 4000 |
| 9 | ART (PLHIV) | 3000 | 4000 |
| 10 | డప్పు కళాకారులు | 3000 | 4000 |
| 11 | కళాకారుల పింఛన్లు | 3000 | 4000 |
| II. Enhancement of Disabled Pensions from ₹3000 to ₹6000 | |||
| 12 | వికలాంగులు | 3000 | 6000 |
| 13 | బహుళ వైకల్యం ఉన్న వృద్ధి | 3000 | 6000 |
| III. తీవ్ర అంగవైకల్యం పింఛన్ ₹15000 | |||
| 14 | మస్క్యులో స్కిన్ డిస్ట్రోపీ, వీల్ చైర్ లేకుండా మంచానికి పరిమితం అయిన వారు | 5000 | 15000 |
| 15 | తీవ్రమైన మస్క్యులార్ డిస్ట్రోఫీ కండాలు మరియు ప్రసార వ్యాధులు | 5000 | 15000 |
| IV. Chronic Diseases (Kidney, Thalassemia etc.) – Enhanced to ₹10000 | |||
| 16 | హైపటైటిస్ ఎలిమినేషన్ – Grade 4 | 5000 | 10000 |
| 17 | కిడ్నీ, కాలేయం మరియు గుండె మార్పిడి | 5000 | 10000 |
| 18 | CKDU (Not on Dialysis) – Serum Creatinine > 5mg | 5000 | 10000 |
| 19 | CKDU (Not on Dialysis) – GFR < 15 ml | 5000 | 10000 |
| 20 | CKDU (Not on Dialysis) – Small Contracted Kidney | 5000 | 10000 |
| V. Other Categories | |||
| 21 | CKDU on Dialysis (Private) | 10000 | No Change |
| 22 | CKDU on Dialysis (Govt.) | 10000 | 10000 |
| 23 | సికిల్ సెల్ వ్యాధి | 10000 | 10000 |
| 24 | తలసేమియా | 10000 | 10000 |
| 25 | హీమోఫిలియా | 10000 | 10000 |
| 26 | డైనమిక్ సంక్రమి పర్సన్ | 5000 | 5000 |
| 27 | అంధత్వం | 500 | 500 |
| 28 | అరుదైన రుగ్మత | 5000 | 5000 |
NTR Bharosa Pension Scheme Eligibility Criteria (2025) – Full Details in Telugu
వృద్ధాప్య పెన్షన్ :
60 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు కలవారు అర్హులు.గిరిజనులు 50 సంవత్సరాలు ఆపై వయస్సు కలవారు అర్హులు.

