Aarogya Sri Cards eKYC Process By GSWS Volunteers
వైస్సార్ ఆరోగ్య శ్రీ పథకానికి సంబందించి ఎటువంటి లబ్ది పొందాలి అనుకున్న తప్పనిసరిగా ఉండవలసినది "ఆరోగ్య శ్రీ కార్డు" . ఈ కార్డు ను గ్రామ సచివాలయాల్లో "పంచాయతీ కార్యదర్శులు Gr-VI (డిజిటల్ అసిస్టెంట్ )" వారు అందిస్తున్నారు. ముందుగా ఆరోగ్య శ్రీ కార్డులకు సంబందించిన పూర్తి ఆప్షన్ లు నవశకం పోర్టల్ లొ అందుబాటులో ఉండేది, కానీ ఎప్పుడు అయితే AP Seva పోర్టల్ అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి అన్ని ఆరోగ్య శ్రీ కార్డుల సర్వీస్ లు ఈ పోర్టల్ లొ దరఖాస్తు కు ఆప్షన్ లు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరోగ్య శ్రీ సర్వీస్ లు
- ఆరోగ్య శ్రీ స్టేటస్
- డిజిటల్ ఆరోగ్య శ్రీ కార్డు జనరేషన్
- కొత్త ఆరోగ్య శ్రీ కార్డు
- ఆరోగ్య శ్రీ కార్డులో మార్పులు, చేర్పులు
పై సర్వీస్ లతో పాటుగా కొత్తగా రెండు ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
- ఆరోగ్య శ్రీ కార్డు డిస్పాచ్ స్టేటస్ అప్డేషన్
- PVC రకపు ఆరోగ్య శ్రీ కార్డు ఆర్డర్ చేయుట
కొత్తగా ఇచ్చిన Health Card Dispatch Status Updation లొ AP seva పోర్టల్ లొ దరఖాస్తు చేసాక ఎవరివి అయితే సచివాలయం కు అందుతాయో ఆ వివరాలను పై ఆప్షన్ లొ డిజిటల్ సహాయకులు నమోదు చేసాక, ఆ సిటిజెన్ ఏ వాలంటీర్ పరిధిలోకి వస్తారో ఆ వాలంటీర్ కు ఆ కార్డును ఇవ్వటం జరుగును. వారు ఆ కార్డును GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లొ కార్డు లొ ఉన్న ఏ ఒక్కరి eKYC తీసుకొని వారికి అందించవలసి ఉంటుంది.
వాలంటీర్లు హెల్త్ కార్డు ఇచ్చే సమయం లొ eKYC చేయు విధానం :
Step 1 : ముందుగా కొత్తగా అప్డేట్ అయిన GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.
Download Latest GSWS Volunteer App
Step 2 : వాలంటీర్ వారి ఆధార నెంబర్ తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత హోం పేజీలో సేవల అభ్యర్థన అనే ఆప్షన్ పై పిక్ చేయాలి. తరువాత HEALTH CARDఅనే ఆప్షన్ పై టిక్ చేయాలి.
Step 3 : సచివాలయంలో డిజిటల్ సహాయకుల ద్వారా అందుకున్న హెల్త్ కార్డు నెంబర్ను Enter Health Card ID వద్ద ఎంటర్ చేయాలి. Submit పై క్లిక్ చేయాలి.
Step 4 : ఆ హెల్త్ కార్డులో ఉన్నటువంటి అందరికి సభ్యుల పేర్లు చూపిస్తుంది. మీకు ఈ కేవైసీకి అందుబాటులో ఉన్న వ్యక్తి పేరును సెలెక్ట్ చేసుకోవాలి. eKYC ను బయోమెట్రిక్ లేదా ఐరిష్ విధానం లొ చేయవచ్చు . eKYC పూర్తి అయిన తరువాత SUCCESS అని Messages చూపిస్తుంది. ఇంతటితో eKYC పూర్తి అయినట్టు.
Note : వాలంటీర్లు eKYC కు వచ్చిన Health Card లేదా Rice Card లను ఎప్పటికి అప్పుడు పూర్తి చేసినట్టు అయితే అటువంటి వారికి ప్రభుత్వం పరిగనించే ప్రోత్సాహకాలలో ప్రాముఖ్యత ఉంటుంది..
PVC Aarogya Sri Card :
- ప్రభుత్వం వైయస్సార్ ఆరోగ్యశ్రీ ప్రారంభ దశలో అందరికీ PVC కార్డులను అందించడం జరిగినది. కానీ తరువాత ఆరోగ్యశ్రీ కార్డులో మార్పులు చేర్పులు చేసిన వారికి పీవీసీ కార్డు రావడం లేదు.
- అటువంటి వారికి, కార్డు ఫోటో అప్డేట్ చేసుకున్న వారికి, కొత్తగా ఏవైనా మార్పులు చేర్పులు చేసుకున్న వారికి ఆరోగ్యశ్రీ కార్డును PVC రూపంలో ఆర్డర్ పెట్టుకునే ఆప్షన్ ను సచివాలయం లొ డిజిటల్ సహాయకుల వారి లాగిన్ లో ఇవ్వడం జరిగినది.
- దీనికి గాను కుటుంబం లొ ఒకరిది బయోమెట్రిక్ / ఆధార్ - మొబైల్ లింక్ OTP అవసరం ఉంటుంది.
- దరఖాస్తు చేసిన 10 రోజుల లోపు కార్డు సచివాలయం కు వస్తుంది.
- దీనికి గాను 70/- ఛార్జ్ ఉంటుంది.
268100847386
ReplyDelete855226903161
ReplyDeleteKousalya
ReplyDelete