YSR Rythu Bharosa Payment Status - Sunna Vaddi Panta Runala Status
YSR Rythu Bharosa Latest News
ఫిబ్రవరి 28 , 2024 న వైస్సార్ రైతు భరోసా 2023-24 3వ విడత ( YSR Rythu Bharosa 2023-24 3rd Phase ) మరియు వైస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు రబీ 2021-22 ,ఖరీఫ్ 2022 ( YSR Sunna Vaddi Panta Runala Bima Scheme ) సంబందించిన నగదు విడుదల అవ్వనుంది .
వైస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు రబీ 2021-22 ,ఖరీఫ్ 2022 ( YSR Sunna Vaddi Panta Runala Bima Scheme ) కింద రబీ 2021-22, ఖరీఫ్ 2022 లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ నేడు నేరుగా జమచేయనున్న గౌ|| ముఖ్యమంత్రి.ఈ-క్రాప్ డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకొని ఏడాది లోపు సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద వడ్డీ రాయితీని ప్రభుత్వం అందిస్తోంది.
వైస్సార్ రైతు భరోసా 2023-24 3వ విడత ( YSR Rythu Bharosa 2023-24 3rd Phase ) మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ. 2,000 చొప్పున 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ. 1,078.36 కోట్లను జమ.సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్.సి. ఎస్.టి. బి.సి, మైనారిటీ కౌలు రైతులు, RoFR (అటవీ), దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా "వైఎస్సార్ రైతు భరోసా"( YSR Rythu Bharosa ) క్రింద ఏటా రూ.13,500 రైతు భరోసా సాయం.
YSR Rythu Bharosa Scheme Details
పథకం పేరు | వైస్సార్ రైతు భరోసా |
ప్రారంభించినది | రాష్ట్ర ప్రభుత్వం |
ప్రారంభం | 2019 అక్టోబర్ 15 |
లబ్దిదారులు | రైతులు , కౌలు రైతులు |
దరఖాస్తు విధానం | రైతు భరోసా ద్వారా |
దరఖాస్తు మొదలు | ప్రభుత్వం నిర్ణయించిన తేదీల్లో |
ప్రయోజనాలు | రూ.13,500 |
దరఖాస్తు ఫీజు | ఉచితం |
అధికారిక వెబ్సైట్ | www.ysrrythubharosa.ap.gov.in |
YSR Rythu Bharosa Scheme
- రైతు భరోసా ( YSR Rythu Bharosa scheme ) పథకాన్ని 2019 జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రైతుల కోసం ప్రారంభించబడిన సంక్షేమ పథకం. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది.
- ఈ పథకం ప్రస్తుత ప్రభుత్వం జూలై 2019 లో విజయవంతంగా ప్రారంభించింది. మొదటిసారిగా దీనిని 2019 అక్టోబర్ 15 న అమలు చేయడం జరిగింది.
- ( YSR Rythu Bharosa scheme ) పథకం ద్వారా రూ. 13,500 రైతులకు వార్షిక ప్రాతిపదికన చెల్లించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 7500 ను మరియు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద 6000 కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
- వీటితో పాటు, అర్హతగల రైతులకు ఉచిత బోర్వెల్లు మరియు జీరో వడ్డీ రుణాలు కూడా ఈ పథకం కల్పిస్తుంది..
- ఈ పథకం కింద సహాయం చేసే మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. వైయస్ఆర్ రైతు భరోసా పథకం ( YSR Rythu Bharosa scheme ) రాష్ట్ర స్థాయి సంక్షేమ పథకం మరియు అర్హత ఉన్న రైతులు సున్నా వడ్డీ రుణాలు పొందగలిగే అర్హులైన రైతులను ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనం చేకూరుస్తుంది...
- కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. కౌలు రైతులు ఈ పథకం కింద సంవత్సరానికి 2500 రూపాయలు పొందుతారు.
- రైతులకు ఉచిత బోర్వెల్ సౌకర్యాలు, రోజులో తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ కల్పన, రాష్ట్రాలలో కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాటు ఈ పథకం లో భాగం, అయితే రైతులకు చెందిన ట్రాక్టర్ల రహదారి పన్నును ఈ పథకం కింద కొనసాగించరు.
- వ్యవసాయం పైన ఆధారపడినవారికి జీవిత బీమా సౌకర్యం కూడా ఇవ్వబడుతుంది, ఇది రూ.5 లక్షలు. అలాగే, ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుంది. పాల డెయిరీలు తిరిగి తెరవబడతాయి మరియు పెండింగ్లో ఉన్న అనేక నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తవుతాయి.
YSR Rythu Bharosa Scheme Application Process
వైయస్సార్ రైతు భరోసా పథకంలో రైతులు సులభంగా చేరవచ్చు. పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు వైయస్సార్ రైతు భరోసా కింద లబ్ధిని పొందవచ్చు. దీనికిగాను రైతు పేరు మీద లేదా రైతు కౌలు చేస్తున్నట్టయితే కౌలుదారునిగా గుర్తింపు ఉన్నట్టయితే అర్హులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు వారికి దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.రైతు భరోసా పథకానికి అప్లికేషన్ చేసుకోవడానికి ఆనులైన్లో ఎటువంటి వెబ్సైట్ ఉండదు. ప్రభుత్వం కాలానుసారం విడుదల చేసే టైం లైన్ ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంటుంది ఆ సమయంలో సంబంధిత రైతు భరోసా ద్వారా దరఖాస్తులను సబ్మిట్ చేయవలసి ఉంటుంది
YSR Rythu Bharosa Scheme Eligibilities
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడు ఎవరైతే ఉంటారో అతను
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
- ఆధార్ కార్డు
- బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి.
- రైతులు లేదా కవులు రైతులు ఈ పథకానికి అర్హులు.
YSR Rythu Bharosa Scheme Required Documents For New Application
- భూమికి సంబంధించి పట్టా /హక్కుదారి పత్రం
- ఆధార్ కార్డు
- బ్యాంకు పాసు బుక్
- రేషన్ లేదా రైస్ కార్డు
YSR Rythu Bharosa Scheme Payment Status and YSR Rythu Bharosa Scheme Application Status
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి
Step 2 : Know Your Status ఆప్షన్ పై క్లిక్ చేయాలి అందులో Know ypur rythu bharosa status (2023-24) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 :దరఖాస్తుదారుని ఆధార నెంబర్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయాలి
Step 4 : చివరగా
- దరఖాస్తు దారిని పేరు
- పేమెంట్ స్టేటస్
- ఏ బ్యాంకులో నగదు జమ అయిందో ఆ బ్యాంకు పేరు
- ఎకౌంట్ నెంబరు చివరి ఆరు నెంబర్లు
- ఎంత నగదు జమయిందో నగదు
చూపిస్తుంది.
YSR Rythu Bharosa Scheme Amount
వైయస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకు రూపాయి 13500 అందిస్తుంది ఈ నగదు ఒకేసారి రావు . మూడు విడతల రూపంలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. ఇదే పథకాన్ని వైయస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం అని కూడా పిలుస్తారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నగదుతో కలిపి రైతు భరోసా డబ్బులు లభిస్తాయి కనుక.కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అనే పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 అందిస్తుంది. ఈ డబ్బును మూడు విడతల రూపంలో రైతుల బ్యాంకు ఎకౌంట్లోకి ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా జమ అవుతుంది. రూ.2000 చొప్పున మూడు విడతల్లో రూ.6000 రైతులకు అందుతుందన్నమాట. ఈ డబ్బులకు అదనంగా ఏపీ ప్రభుత్వం ₹7,500 అందిస్తుంది మొత్తం ₹13,500 రైతులకు లబ్ధి చేకూరుతుంది.
YSR Rythu Bharosa Scheme Eligibile List
Step 1 : కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయాలి.
Step 2 : మీయొక్క రాష్ట్రము జిల్లా మండలము గ్రామాన్ని ఎంచుకొని Get Report పై క్లిక్ చేయండి.
Step 3 : Farmer Name వద్ద మీ పేరు ఉన్నట్టు అయితే వాటికీ PM Kisan నగదు జమ అవుతుంది.