Know Chandranna Bima Status
Chandranna Bima Scheme
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Chandranna Bima Scheme చంద్రన్న బీమా పథకం ద్వారా ఇంట్లో సంపాదించే వ్యక్తి మరణించినట్టయితే వారికి ఉచితంగా 1 లక్ష రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు భీమా అందిస్తుంది. కుటుంబంలో 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉండి సంపాదించే వ్యక్తి సహజంగా మరణిస్తే వారికి 1 లక్ష రూపాయలు , 18 నుండి 70 సంవత్సరాలు మధ్య వయసు ఉండి సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు పూర్తిగా అంగవైకల్యము పొందిన లేక మరణించిన ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు , 18 నుండి 70 సంవత్సరాలు మధ్య వయసు ఉండి సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు పాక్షిక అంగవైకల్యం పొందితే 2 లక్షల 50 వేళా రూపాయల వరకు Chandranna Bima Scheme చంద్రన్న బీమా పథకం ద్వారా సాయం అందుతుంది .
Chandranna Bima Status
చంద్రన్న బీమా పథకం ద్వారా బీమా నగదు పొందాలి అంటే తప్పనిసరిగా చంద్రన్న బీమా నమోదు Chandranna Bima Scheme Enrollment చేసుకొని ఉండవలెను. పూర్తి పేరు ద్వారా లేదా ఆధార నెంబర్ ద్వారా లేదా రైస్ కార్డు నెంబర్ ద్వారా Chandranna Bima Scheme లో నమోదు చేసుకుని ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. Chandranna Bima Scheme Status లేదా Chandranna Bima Scheme Enrollment Status తెలుసుకునే విధానం ఇప్పుడు చూద్దాం
Step 1 : ముందుగా కిందివ్వబడిన లింక్ ఓపెన్ చెయ్యండి . అందులో Chandranna Bima Scheme Status అనే ఆప్షన్ పై టిక్ చెయ్యండి .
Step 2 : కింద చూపిన పేజీ ఓపెన్ అవుతుంది . అందులో 2024-25 సంవత్సరంను ఎంచుకోండి .
Step 3 : తరువాత కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ లేదా పేరు లేదా కుటుంబ రైస్ కార్డు నెంబర్ లో ఏది అందుబాటులో ఆ వివరాలు సెలెక్ట్ చేసుకోవాలి .Step 4 : ఆధార్ / పేరు / రైస్ కార్డు నెంబర్ లో ఎదో ఒక నెంబర్ ఎంటర్ చేయాలి .Step 5 : కింద తెలిపిన వివరాలు చూపిస్తాయి .- పాలసీ ఎవరి పేరు మీద ఉన్నదో వారి పేరు
- వయసు
- పుట్టిన తేదీ
- కులము
- రైస్ కార్డు నెంబరు
- ఆధార్ నెంబరు
- సచివాలయం పేరు
- మండలం పేరు
- జిల్లా పేరు
- సచివాలయంలో భీమా కొరకు చేసిన తేదీ
- సచివాలయంలో దరఖాస్తును ఆమోదించిన తేదీ
- నామిని పూర్తి పేరు
- దరఖాస్తుదారుని తో నామిని సంబంధము లేదా బంధుత్వము
- ఎటువంటి బీమాకు అర్హులు
- సాధారణ మరణము
- ప్రమాదంలో మరణం
- ప్రమాదంలో పూర్తి అంగవైకల్యము
కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి లేదా భీమాకు నమోదు చేసిన వ్యక్తి కాకుండా మిగతా ఎవరు వివరాలు ఎంటర్ చేసిన పైన చూపిన విధముగా వస్తుంది. అర్హులు అయ్యుండి పై విధంగా "Details Not Found" అని వచ్చిన వారు తదుపరి చంద్రన్న బీమా సర్వే వరకు వేచి ఉండవలసి ఉంటుంది.