వికలాంగుల మరియు హెల్త్ పెన్షన్ వెరిఫికేషన్ సమాచారం -
AP Pensions Verification 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెరపైకి మరలా పెన్షన్ వెరిఫికేషన్ AP Pension Verification 2025 టాపిక్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,18,900 మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ చేయుటకు ప్రభుత్వం విధి విధానాలు విడుదల చేసింది. పెన్షన్ వెరిఫికేషన్ లో బొగస్ లేదా ఫేక్ సర్టిఫికెట్లు లేదా అర్హత లేకుండా పెన్షన్ పొందిన వారికి పెన్షన్ను తొలగిస్తారు.
మొత్తం 3 విభాగల్లో ఉన్న పెన్షన్ దారులను వెరిఫికేషన్ చేయనున్నారు. మెడికల్ పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు మరియు మల్టిడిఫార్మిటీ లెప్రసీ వారిని వెరిఫికేషన్ చెయ్యనున్నారు.
మెడికల్ పెన్షన్లు అంటే
- చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం చేసే పక్షవాతం,
- తీవ్రమైన కండరాల బలహీనత కేసులు మరియు ప్రమాద బాధితులు వీల్‌చైర్‌కే పరిమితమయ్యే
వారు వస్తారు.
వికలాంగుల పెన్షన్లు అంటే
- లోకోమోటర్/ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్
- దృష్టి లోపం
- వినికిడి లోపం
- మెంటల్ రిటార్డేషన్
- మానసిక అనారోగ్యం
- బహుళ వైకల్యం
పై పెన్షన్లతో పాటు మల్టిడిఫార్మిటీ లెప్రసీ వారిని కూడా వెరిఫికేషన్ చేస్తారు.
పెన్షన్ దారులను తనిఖీ ఎక్కడ చేస్తారు ?
పైన 2 తెలియజేసిన మెడికల్ పెన్షన్లను మెడికల్ టీం వారు ఇంటింటికి వెళ్లి తనిఖీ చేస్తారు. వికలాంగుల పెన్షన్లు మరియు మల్టిడిఫార్మిటీ లెప్రసీ పెన్షన్లను ఆసుపత్రి స్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు.
ఆసుపత్రి ఆసుపత్రి స్థాయి అంటే ఎక్కడ చేస్తారు ?
కింద తెలిపిన ఐదు ప్రాంతాల్లో ఎక్కడైనా చేయొచ్చు
- కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు
- ఏరియా ఆసుపత్రిలో
- డిస్టిక్ ఆస్పత్రులు
- గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్
- మెడికల్ కాలేజీలు
వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది ?
- ముందుగా ప్రింట్ చేయబడిన సదరం రిపోర్ట్ ప్రకారం
- మొబైల్ యాప్ ద్వారా
- వెబ్సైట్ ద్వారా
వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పెన్షన్లకు తనిఖీ చేస్తారు?
How many statewide pensions are audited?
రూ.15,000 పెన్షన్ అందిస్తున్న
- చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం చేసే పక్షవాతం - 16,479 పెన్షన్లు
- తీవ్రమైన కండరాల బలహీనత కేసులు మరియు ప్రమాద బాధితులు వీల్‌చైర్‌కే పరిమితమయ్యే వారు - 7612 పెన్షన్లు
రూ. 6,000 పెన్షన్లు అందిస్తున్న
- లోకోమోటర్/ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ - 463425 పెన్షన్లు
- దృష్టి లోపం - 90302 పెన్షన్లు
- వినికిడి లోపం - 109232 పెన్షన్లు
- మెంటల్ రిటార్డేషన్ - 103042 పెన్షన్లు
- మానసిక అనారోగ్యం - 19193 పెన్షన్లు
- బహుళ వైకల్యం - 2782 పెన్షన్లు
- మల్టిడిఫార్మిటీ లెప్రసీ - 6833 పెన్షన్లు
మొత్తం 818900 పెన్షన్లకు తనిఖీ జరగనుంది.
జిల్లాస్థాయి పెన్షన్ తనకి కమిటీల్లో ఎవరెవరు ఉంటారు ?
- జిల్లా కలెక్టర్
- ప్రాజెక్ట్ డైరెక్టర్, DRDA
- ప్రభుత్వ వైద్య కళాశాలల సూపరింటెండెంట్
- జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి
- జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్
- జిల్లా లెప్రసీ అధికారి
- జిల్లా పంచాయతీ అధికారి
- ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా ప్రజా పరిషత్
- జిల్లా కోఆర్డినేటర్, GSWS విభాగం
- మున్సిపల్ కమిషనర్లు
- పోలీసు శాఖ ప్రతినిధి
జిల్లా కలెక్టర్ వారు చైర్మన్గా, మిగిలిన వారు మెంబర్లుగా ఉంటారు.
ఏ పెన్షన్లకు ఎవరు తనిఖీ చేస్తారు?
Who checks which pensions?
Rs15,000 పెన్షన్ నగదు తీసుకుంటున్న మెడికల్ పెన్షన్ దారులైన చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం చేసే పక్షవాతం, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు మరియు ప్రమాద బాధితులు వీల్‌చైర్‌కే పరిమితమయ్యే వారికి కింద తెలిపిన టీం తనిఖీ చేస్తుంది
- ఆర్థోపెడిషియన్
- జనరల్ ఫిజిషియన్
- PHC-మెడికల్ ఆఫీసర్
- డిజిటల్ అసిస్టెంట్
లోకోమోటర్/ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్లకు కింద టీం తనిఖీ చేస్తుంది.
- ఆర్థోపెడిషియన్
- సీనియర్ మెడికల్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్
- పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్ మెడికల్ సూపరింటెండెంట్
- డిజిటల్ అసిస్టెంట్
వినికిడి లోపం ఉన్న పెన్షన్లకు కింద టీం తనిఖీ చేస్తుంది.
- ENT స్పెషలిస్ట్
- సీనియర్ మెడికల్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్
- పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్ మెడికల్ సూపరింటెండెంట్
- డిజిటల్ అసిస్టెంట్
మెంటల్ రిటార్డేషన్ పెన్షన్లకు కింద టీం తనిఖీ చేస్తుంది.
- మానసిక వైద్యుడు
- సీనియర్ మెడికల్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్
- పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్ మెడికల్ సూపరింటెండెంట్
- డిజిటల్ అసిస్టెంట్
దృష్టి లోపం ఉన్న పెన్షన్లకు కింద టీం తనిఖీ చేస్తుంది.
- నేత్ర వైద్యుడు
- సీనియర్ మెడికల్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్
- పాయింట్ ఆఫ్ వెరి మెడికల్ సూపరింటెండెంట్
- డిజిటల్ అసిస్టెంట్
బహుళ వైకల్యం ఉన్న పెన్షన్లకు కింద టీం తనిఖీ చేస్తుంది.
- ఆర్థోపెడిషియన్
- ENT స్పెషలిస్ట్
- మానసిక వైద్యుడు
- నేత్ర వైద్యుడు
- సీనియర్ మెడికల్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్
- పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్ మెడికల్ సూపరింటెండెంట్
- డిజిటల్ అసిస్టెంట్
మల్టిడిఫార్మిటీ లెప్రసీ ఉన్న పెన్షన్లకు కింద టీం తనిఖీ చేస్తుంది.
- PHC వైద్యుడు
- జిల్లా లెప్రసీ అధికారి
పెన్షన్లు తనిఖీ కార్యచరణ ప్రణాళిక ఎలా ఉంటుంది ?
What is NTR bharosa pensions inspection action plan?
జిల్లా స్థాయిలో DLCC మీటింగ్ నిర్వహణ
⏬
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెడికల్ టీంల ఏర్పాటు
⏬
మెడికల్ స్పెషల్ డాక్టర్ యొక్క వివరాలను DM & HO వారి SS Pension లాగిన్ లో అప్డేట్ చేయడం తద్వారా వారు యాప్ లాగిన్ యాక్సిస్ చేయగలుగుతారు
⏬
ఒక మెడికల్ టీంకు ఒక డిజిటల్ అసిస్టెంట్ ను ట్యాగింగ్ చేయటం
⏬
సదరం అసెస్మెంట్ వివరాలను సదరం డేటాబేస్ ప్రకారం ప్రింట్ తీసుకునుట
⏬
మండల స్థాయి మున్సిపాలిటీ స్థాయి షెడ్యూలు వేయుట మరియు రూట్ మ్యాపు సిద్ధం చేయుట
⏬
MPDO, MC & PHC MO అధికారులకు షెడ్యూలు తెలియజేయుట, డేట్ అఫ్ విసిట్ కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం.
⏬
పెన్షనర్లకు గ్రామ వార్డు సచివాల సిబ్బంది సమాచారం అందించుట వెరిఫికేషన్ కొరకు
⏬
మెడికల్ టీమ్లకు మెడికల్ ఆఫీసర్ మరియు ANM సహాయం అందిస్తారు
⏬
మెడికల్ టీం లకు పెన్షన్ దారిని ఇంటి వద్దకు తీసుకెళ్లేందుకు సచివాల సిబ్బంది సహాయం చేయుట.
పెన్షన్ల తనిఖీ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
What is the verification process of NTR bharosa pensions?
షెడ్యూల్ ప్రకారం మెడికల్ టీము పెన్షన్ల ఇంటికి వెళ్తారు
⏬
సదరం పోర్టల్ నుండి సదరం వివరాలతో కూడిన ఫారాలను ప్రింట్ తీసుకొని వస్తారు.
⏬
తనిఖీ సమయంలో ఫారం ను ఫీల్ చేసి మెడికల్ టీం వారు సంతకం పెడతారు.
⏬
డిజిటల్ అసిస్టెంట్ వారు మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసి Install చేస్తారు.
⏬
డిజిటల్ అసిస్టెంట్ వారు Install చేసిన యాప్ లో డాక్టర్లు ప్రశ్నల యొక్క సమాధానాలను ఫీల్ చేస్తారు.
⏬
15వేల పెన్షన్లకు సంబంధించి మెడికల్ టీం వారి యొక్క రిమార్కులను ఎంటర్ చేస్తారు.
⏬
ఫారం ను డిజిటల్ అసిస్టెంట్ వారు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు.
⏬
డిజిటల్ అసిస్టెంట్ వారు పెన్షన్ దారుని ఫోటో తీసుకొని వారి యొక్క ఆధార్ ధ్రువీకరణను పూర్తి చేస్తారు.
⏬
మెడికల్ టీం వారు ఫారాలను జిల్లా స్థాయిలో DM&HO వారికి సీల్ కవర్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు.
⏬
DM&HO వారి లాగిన్ లో ఈ యొక్క ఫారాలను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు.
⏬
సదరం సాఫ్ట్ వేరు పెన్షన్లకు సంబంధించి % తో కూడిన వివరాలను జనరేట్ చేస్తుంది.
⏬
జనరేట్ చేసిన సర్టిఫికెట్పై మెడికల్ టీం డిజిటల్ సైన్ చేస్తుంది.
⏬
చివరగా అర్హత ప్రమాణాల మేరకు పెన్షన్ దారుని కొనసాగింపు లేదా పెన్షన్ రద్దు చేయడం జరుగుతుంది .
పెన్షన్ తనిఖీ సమయంలో మొబైల్ యాప్ లో అడిగే ప్రశ్నలు ఏంటి ?
What are the questions asked in mobile app during NTR bharosa pension check?
- పించన్ దారుణ యొక్క స్టేటస్
- CVA [ Cerebral Vascular Accident ]
- CVS అవును అయితే Type?
- CVA అవును అయితే రిమార్క్ లు
- పోలియో తర్వాత అవశేష పక్షవాతం ?
- అవును అయితే Type?
- అవును అయితే రిమార్క్ లు
- కణితులు/ఇతరాలు?
- అవును అయితే Type?
- అవును అయితే రిమార్క్ లు
- వికలాంగుల అవటానికి గల కారణము
- పూర్తిగా మంచానికి పరిమితమా ?
- వీల్ చైర్ అవసరమా ?
- సదరం % 85 కన్నా తక్కువ ?
- మీరు ఈ పింఛన్దారునికి పెన్షన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా ?
- డాక్టరు అబ్జర్వేషన్ రిమార్క్
- పింఛనుదారుని ఫోటో
- సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటే అప్లోడ్ చేయండి
- పించను దారుని ధృవీకరణ ( ఫింగర్ / ఫేస్ / ఐరిష్ )
NTR Bharosa Pension Scheme Inspection Schedule and Important Information
పెన్షన్ల తనిఖీ షెడ్యూలు మరియు ఇంపార్టెంట్ సమాచారం కోసం వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.