Fix Annadata Sukhibava Payment Issues: Pattadar Aadhaar Seeding Guide
Annadata Sukhibava Payment Issues : అన్నదాత సుఖీభవ మొదటి విడత నగదు రూపాయలు Rs.5000/- ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన రైతులకు ఆగస్టు 2, 2025 నాడు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. 90% పైగా రైతులకు నగదు వారి బ్యాంకు ఖాతాలో జమవడం కూడా జరిగింది. Check Annadata Sukhibava Payment Status . మిగతా వారికి పేమెంట్ ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ రైతు వద్ద ఉన్నటువంటి సమస్యల వలన వారికి నగదు క్రెడిట్ అవ్వడం లేదు. కనీసం 10 సెంట్లు భూమి లేకపోవడం, రైతు ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా లింకు లేకపోయినా, రైతు సేవ కేంద్రం వద్ద రైతు eKYC పూర్తి చేసుకోలేకపోయినా లేదా గతంలో చెప్పిన 16 కారణాల్లో ఏదైనా కారణం ఉన్నా సరే వారికి నగదు క్రెడిట్ అవ్వదు. పేమెంట్ క్రెడిట్ అవ్వకపోవడం గల ముఖ్యమైన కారణాలలో ఒకటి రైతు యొక్క భూమికి రైతు యొక్క ఆధార్ కార్డు నెంబర్ వెబ్ ల్యాండ్ నందు లింకు లేకపోవడం. లింకు లేని వారందరికీ కూడా వెబ్లాంట్ లింక్ లేదనే కారణంతో పేమెంట్ ప్రస్తుతానికి హోల్డ్ లొ ఉంది వారికి పేమెంట్ పడలేదు. ఈ కారణంతో పేమెంట్ పడినవారు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
What is Pattadar Aadhaar Seeding Process
వెబ్ ల్యాండ్ కు ఆధార్ కార్డు లింక్ లేకపోవడం అంటే ఏంటంటే రైతు కలిగినటువంటి భూమికి రైతు యొక్క ఆధార్ కార్డు నెంబరు లింకు ఉంటే మాత్రమే ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ నగదు ఆ రైతుకు మాత్రమే క్రెడిట్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అందులో భాగంగానే వెబ్లాండ్ ఆధార్ కార్డు నెంబరు లింకు తప్పనిసరి చేయడం జరిగింది. ఈ సమస్యతో నగదు క్రెడిట్ అవ్వని వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, రైతు వారి దగ్గరలో ఉన్న మీ సేవకు గాని లేదా గ్రామా లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి వారి బయోమెట్రిక్ ను అందించి వెబ్లాండు లింకును చేసుకోవాలి తర్వాత సంబంధిత విఆర్ఓ మరియు ఎమ్మార్వో వారి తాసిల్దార్ వారి ఆమోదం పూర్తయితే అప్పుడు లింక్ అనేది అవుతుంది తర్వాత సంబంధిత రైతుసేవ కేంద్రం వద్ద పనిచేయుచున్న అధికారులైన గ్రామ వ్యవసాయ కార్యదర్శి వారి లాగిన్ లో అన్నదాత సుఖీభవ మొదటి విడత పేమెంట్ పడేందుకుగాను ఆగస్టు 25వ తేదీ లోపు అర్జీను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అర్జీలు నమోదు చేసుకున్న వారికి వెంటనే ప్రభుత్వం పేమెంట్ను విడుదల చేయడం జరుగుతుంది.
Join GSWS Helper WhatsApp Channel
Requirements For Pattadar Aadhaar Seeding
రైతు పట్టాదార్ ఆధార్ సీడింగ్ చేసుకోవడానికి గాను ముఖ్యంగా రైతు వద్ద పట్టాదారు పాస్ పుస్తకం గాని లేదా రీసెంట్ గా తీసుకున్న ROR 1B జెరాక్స్ ఉండాలి. రైతు ఆధార్ జిరాక్స్ ఒకటి. వీటితోపాటు రైతు అప్లికేషన్ ఫారం ను ఫీల్ చేసి తీసుకువలసి ఉంటుంది. అప్లికేషన్ వారంలో కింద ఇవ్వబడును లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి అందులో జిల్లా మండలం గ్రామం ఖాతా నెంబర్ అడుగుతుంది భూమికి సంబంధించిన వివరాలు నమోదు చేసిన తర్వాత Seeding Type లొ Aadhar నో ఎంచుకొని మొబైల్ నెంబర్ను మరియు రైతు ఆధార్ నెంబర్ను రాయాలి రాసిన తర్వాత రైతు సంతకం చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫారం కోసం కింద లింక్ ఓపెన్ చేసి సెర్చ్ లొ "Mobile Number & Pattadar Aadhar Seeding In Land Records Application Form" టైప్ చేస్తే మీకు అప్లికేషన్ ఫారం కనిపిస్తుంది.
Where to Apply for Pattadar Aadhaar Seeding
పై వివరాలతో రైతు తనకు దగ్గర్లో ఉన్న ఏదైనా సరే గ్రామా లేదా వార్డు సచివాలయాన్ని లేదా మీ సేవను సందర్శించాల్సి ఉంటుంది దీనికి సొంత గ్రామంలో ఉన్న మీ సేవ లేదా గ్రామ సచివాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ఏ మీసేవ లేదా ఈ గ్రామా లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో తప్పనిసరిగా భూమి ఎవరు పేరు అయితే ఉందో ఆ రైతు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది కాబట్టి వారు సంబంధిత ఆఫీసుకు హాజరు అవ్వాల్సి ఉంటుంది. హాజరయ్యేటప్పుడు పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్లు తీసుకొని వెళ్ళాలి. దరఖాస్తు ఫీజు 50 రూపాయలు మాత్రమే.
Pattadar Aadhaar Seeding Application Process
గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారి అదే మీ సేవలైతే మీసేవ ఆపరేటర్ వారు ఈ యొక్క పనిని వారి యొక్క లాగిన్ లో చేస్తారు. గ్రామా లేదా వార్డు సచివాలయంలో అయితే AP Seva Portal --> Mee Seva Service --> Revenue department --> Mobile Number & Pattadar Aadhaar Seeding --> Wnter Farmer Aadhar Numbers --> Authenticate --> Same State / Other State --> Select District, Mandal, Village Secretariat, Khata Number --> Seeding - Aadhar --> Authentication Type --> Biometric / Irish --> Select Device --> Enter Mobile Number & Aadhar Of Farmer --> Authentication --> Completed రీ సర్వే అవ్వని గ్రామాల్లో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది.
అదే రీ సర్వే అయిన గ్రామాల్లో అయితే AP Seva Portal --> Revenue --> 30. Pattadar Aadhar Seeding To LP Number ఆప్షన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను సంబంధిత అధికారులు పూర్తి చేస్తారు.తర్వాత సంబంధిత VRO & తాసిల్దార్ వారి ఆమోదం తర్వాత వెబ్లాండు ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
Know Pattadar Aadhaar Seeding Status
కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసిన తర్వాత సచివాలయంలో లేదా మీ సేవలో దరఖాస్తు చేసిన తర్వాత మీకు ఇచ్చిన రసీదులో లేదా మీకు వచ్చిన మెసేజ్ లో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ను కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి
అప్లికేషన్ స్టేటస్ ఫర్ ద ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది. స్టేటస్ లో Approved అని వస్తే దాని అర్థం లో పట్టాదార్ ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తి అయింది అని అర్థం పెండింగ్లో ఉన్నట్లయితే సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి మరియు తాసిల్దార్ వారిని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది.
445
ReplyDelete