AP Gov House Hold Mapping Information
ప్రభుత్వం అందించే అన్ని ప్రభుత్వ పథకాలకు ప్రామాణికంగా తీసుకునే అంశం హౌస్ హోల్డ్ మ్యాపింగ్. గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన వెంటనే వారిద్వారా రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి కుటుంబ వివరాలను GSWS Volunteer అనే మొబైల్ అప్లికేషన్లో సర్వే చేసి Add చెయ్యటం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అన్ని పథకాలకు ప్రామాణికంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండే వ్యక్తుల సమాచారం తీసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా భూమి, అర్బన్ ప్రాపర్టీ,కార్, ప్రభుత్వ ఉద్యోగి,ఆదాయపు పన్ను, కరెంటు యూనిట్ వంటి వివరాలు ఉంటాయి.
ప్రస్తుతం House Hold Mapping కు సంబందించిన అందుబాటులో ఉన్న ఆప్షన్ లు :
1. కొత్త కుటుంబం మాపింగ్ చెయ్యటం (New Household Mapping) :
★ ఎక్కడా మాపింగ్ అవ్వని వారు ఈ విధానము లో HH మాపింగ్ Add అవ్వవచ్చు. దీనికి గాను ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
★ మొదట్లో గ్రామ వార్డు వాలంటీర్ వారి మొబైల్ అప్లికేషన్ లో ఆప్షన్ అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుతం వారికి అవకాశం లేదు. ప్రస్తుతం PS / WS వారి లాగిన్ లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
★ PS / WS వారికి లాగిన్ లేకపోతే PSDA / WEDPS వారి లాగిన్ లో లాగిన్ క్రియేట్ చెయ్యవచ్చు.Password మర్చి పోయినట్టు అయితే సంబందించిన జిల్లా DRP (District Resource Person) వారికి సమస్య తెలియజేసినట్టు అయితే వారు Re-Set చెయ్యటం జరుగుతుంది.
★ PS / WS వారి GSWS పాత పోర్టల్ లో Services ట్యాబు లో Adding Family Member అనే ఆప్షన్ లో కొత్తగా కుటుంబాన్ని Add చేయువచ్చు. అందలో
- 6 సంవత్సరాల లోపు,
- 15 సంవత్సరాలు పైబడి,
- దివ్యంగులు,
- ఇతరులకు కొత్తగా Add చెయ్యవచ్చు.
అందులో వాలంటీర్ క్లస్టర్ ఎంచుకొని New అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎవరిని అయితే యాడింగ్ చేస్తారో వారి ఆధార్ నెంబరు ఎంటర్ చేసి దానికి వచ్చే ఓటీపీను ఎంటర్ చేయవలసి ఉంటుంది. తరువాత పంచాయతీ కార్యదర్శి వారి ఆధార్ నెంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ కు వచ్చే ఓటీపీను ఎంటర్ చేయాలి. ఆ విధంగా కుటుంబంలో మొదటి వ్యక్తి యాడ్ అవటం జరుగుతుంది . తరువాత వాలంటరీ క్లస్టర్ సెలెక్ట్ చేసుకుని అందులో ముందుగా యాడ్ చేసిన వ్యక్తి పేరు సెలెక్ట్ చేసి Existing అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కుటుంబంలో మిగతా వారిని ఆ కుటుంబంలో యాడ్ చేసుకోవచ్చు.
★ ఏ సచివాలయం లో అయితే Add అవ్వాలి అనుకుంటారో అక్కడి సెక్రటరీ వారి లాగిన్ లో మాత్రమే ఈ ఆప్షన్ ద్వారా Add అవ్వాలి. ఈ విధం గా Add అయిన 24 గంటల్లో వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ లో పేర్లు చూపిస్తాయి.
2. వివాహం జరిగిన మహిళను వారి అత్తవారి ఇంట్లో Add చేయటం (House Hold Migration On Marrie Ground):
★ పెళ్లి అయిన తరువాత పెళ్లి అయిన మహిళను వారి అత్తవారి HH మాపింగ్ లో Add చేసే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్ ద్వారా Add చెసినచో 72 గంటల్లో Add జరుగును.దరఖాస్తు చేయు సమయం లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సచివాలయం లో బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది.దరఖాస్తు కు ఎటువంటి ఫీజు ఉండదు.
Required Documents :
- పెళ్లి కొడుకు ఆధార్
- పెళ్లి కూతురు ఆధార్
- Marriage Certificate
- దరఖాస్తు ఫారం
★ ఈ ఆప్షన్ ను సచివాలయం లో PSDA / WEDPS వారి Grama Ward Sachivalayam లాగిన్ లో అవకాశం ఇవ్వటం జరిగింది. AP Seva Portal --> Other Services --> GSWS --> Household Migration on Marriage Grounds ద్వారా సర్వీస్ ను ఎంచుకోవలెను.
★ Work Flow :
Ward : WEDPS->WS-> MC (Final Approval)
Village : DA->PS->MPDO (Final Approval)
3. రెండు కుటుంబాలను ఒకటిగా కలపటం (Merging of two households) :
★ ఒకే కుటుంబం లోని వ్యక్తులు వేరు వేరుగా రెండు కుటుంబాలుగా HH మాపింగ్ లో ఉన్నట్టు అయితే ఈ ఆప్షన్ ద్వారా వారికి ఒకే కుటుంబంగా HH మ్యాపింగ్ లో చేయవచ్చు.
★ దీనికి గాను ఏ కుటుంబ సభ్యులు అయితే వేరొక కుటుంబం లో Add అవ్వాలో వారు అందరి బయోమెట్రిక్‌లు మరియు Add అవుతున్న కుటుంబ సభ్యుల్లో కుటుంబ పెద్ద బయోమెట్రిక్ అవసరం ఉంటుంది. ఇద్దరి యొక్క వాలంటీర్ల క్లస్టర్ నెంబర్ లు, ఏ సచివాలయామె అవసరం ఉంటుంది.
★ ఈ ఆప్షన్ ను సచివాలయం లో PSDA / WEDPS వారి Grama Ward Sachivalayam లాగిన్ లో అవకాశం ఇవ్వటం జరిగింది. AP Seva Portal --> Other Services --> GSWS --> House Holds Merging ద్వారా సర్వీస్ ను ఎంచుకోవలెను.
★ Work Flow :
Ward : WEDPS->WS (Final Approval)
Village : DA-> PS (Final Approval)
★ Application Fee : 0
4) కుటుంబ విభజన (House Hold Split) :
★ కుటుంబ విభజనకు సంబంధించి కొత్తగా కొన్ని ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్లు సచివాలయం లోని PSDA/WEDPS వారి AP SEVA పోర్టల్ లో GSWS Service's లో House Split లో ఇవ్వటం జరిగింది. ఆ ఆప్షన్ లు
4.1) Marriage Split
4.2) Divorce Split
4.3) Single Old Age Split
★ Application Fee : 0 పై సర్వీస్ లు ఉచితంగా అందించటం జరుగును.
★ Work Flow :
Ward : WEDPS->WWDS--->WS-> MC (Final Approval)
Village : DA -->WEA-PS-> MPDO (Final Approval)
Complete Split Process Information : 👇
4.1) Marriage Split :
★ ఒక HH మాపింగ్ లో రెండు జంటలు అనగా Wife - Husband, Wife - Husband లు ఉన్నప్పుడు ఈ ఆప్షన్ ద్వారా వారికి విడి విడిగా మాపింగ్ చెయ్యవచ్చు. పెళ్లి అయినా మహిళా వారి భర్త తో కలిపి విడిగా మాపింగ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు పై ఆప్షన్ 2 అనగా Members Migration On Marriage Ground ద్వారా ముందు గా వారి అత్తవారి ఇంట్లో Add అయ్యి అప్పుడు Split అవ్వాలి.
★ HH మాపింగ్ Marriage Case లో Split అవ్వాలి అంటే తప్పనిసరిగా Household 1 లో ఒకరికి, Household 2 లో ఒకటికి ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. దరఖాస్తు చేయు సమయం లో OTP లు అవసరం ఉంటుంది.
★ Required Documents :
1. Application Form
2. Any One Of Below (ఏదైనా ఒకటి)
- Marriage Certificate
- Rice Card
- Aarogya Sri Card
- FMC - Family Member Certificate
- Passport
- Aadar Card
పై డాక్యుమెంట్ లలో తప్పనిసరిగా C/O అప్డేట్ అయ్యి ఉండాలి.
4.2) Divorce Split :
★ ఈ ఆప్షన్ ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విభజన జరగాలంటే విడాకులు తీసుకున్న ఇద్దరు కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి. అప్పుడు మాత్రమే వారు Split అవుతారు.
★ Required Documents :
- Application Form
- Divorce Certificate
4.3) Single Old Age Person Split :
★ ఈ ఆప్షన్ ఉపయోగించడానికి హౌజ్ హోల్డ్ లో ఒక జంట లేదా 35 సంవత్సరాలు దాటిన వారు ఉండాలి.
★ Single House Hold Mapping ద్వారా విభజన కేవలం 01 వ్యక్తికి మాత్రమే అవుతుంది.
★ ఈ ఆప్షన్ ద్వారా విభజన అవ్వవలసిన వారి వయసు 60 సంవత్సరాలకన్నా ఎక్కువ ఉండాలి మరియు Widow / Widower అయ్యి ఉండాలి.
★ ఈ ఆప్షన్ ద్వారా విభజన అవ్వవలసిన వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది.
★ Required Documents: (ఏదైనా ఒకటి చాలు )
- Spouse Death Certificate or
- Rice Card or
- Widow Pension Card
DOWNLOADS :
1.All Split Application Froms 👇
2. Know Citizen Cluster : Click Here
Important Images :
![]() |
HH Mapping Work Flow |
Sir house hold marriage split MC/MPDO login approval Aina kuda Inka volunteer mapping lo split avvaledu . Two families chupistundi . Em cheyali final approval aindi . Evarini contact cheyali ekkada pending undi
ReplyDeleteHose hold mapping ples religed date
ReplyDelete