వైస్సార్ నేతన్న నేస్తం 2023-24 కొత్త సమాచారం :
- జులై 2023 నెల 21న నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నారు.
- "YSR రైతు భరోసా పథకం నందు లబ్ది పొందినారు" అనే కారణంతో ineligible అయిన లబ్ధిదారులను కూడా నేతన్న నేస్తం పథకానికి అర్హులు గా గుర్తించడం జరిగింది.గమనించగలరు
- వరుసగా ఐదో ఏడాది ఈ పథకం అమలు ద్వారా 80,686 మందికి దాదాపు రూ.300 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది.
- వైస్సార్ నేతన్న నేస్తం 2023-24 సంవత్సరానికి సంబందించిన తుది అర్హుల, అనర్హుల జాబితాలు సచివాలయ ఉద్యోగుల NBN పోర్టల్ లొ అందుబాటులో కలవు.
- వైయస్సార్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి ప్రాథమిక అర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాలలో సోషల్ ఆడిట్ కోసం ప్రదర్శిస్తున్నారు
- లిస్ట్ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సచివాలయంలో తెలియచేయవచ్చు
వైస్సార్ నేతన్న నేస్తం పథకం 2023-24 కింద అప్లికేషన్ స్టేటస్ & పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము :
వైస్సార్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ ను కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా ఎవరికీ వారు వారి మొబైల్ లో ఆధార్ నెంబర్ తో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు
వైయస్సార్ నేతన్న నేస్తం పథకం యొక్క లక్ష్యం :
చేనేత నేత కార్మికులకు వారి చేనేత పనులను మెరుగుపరిచేందుకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం.
వైయస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రయోజనాలు :
ఈ పథకం కింద, ప్రతి సంవత్సరం సొంత మగ్గాలు ఉన్న నేత కార్మికుల బ్యాంకు ఖాతాలకు రూ. 24,000 నేరుగా జమ చేయబడుతుంది. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడు రూ .1.2 లక్షల మొత్తం సహాయాన్ని అందుకుంటారు.
వైయస్సార్ నేతన్న నేస్తం పథకం అర్హతలు ఏమిటి :
- ఈ పథకం కింద, దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా ఉండాలి.
- దరఖాస్తుదారుడు వైఎస్ఆర్ నేథన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, అతను / ఆమె తప్పనిసరిగా వృత్తిపరంగా చేనేత నేతగా ఉండాలి.
- ఈ పథకం ప్రకారం, దరఖాస్తుదారు చేనేత సంఘంలో నమోదు చేసుకోవాలి.
- ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా దారిద్య్ర రేఖ దిగువన ఉండాలి.
- మగ్గాలు ఎన్ని ఉన్నా ఒక కుటుంబం లో ఒకరికే ప్రయోజనం
వైయస్సార్ నేతన్న నేస్తం పథకం కు ఎలా దరఖాస్తు చేయాలి :
సచివాలయాలు సిద్ధం చేసిన జాబితా వెరిఫై చేసి లబ్ధిదారులను గుర్తిస్తారు. వాలంటీర్లు మరియు సిబ్బంది బయోమెట్రిక్ తీసుకుని ఎంట్రీ చేస్తారు. ఆ విధంగా ఎంట్రీ చేసిన జాబితా MPDO లేదా MC లు వెరిఫై చేసి చేనేత శాఖ ద్వారా తుది జాబితా ప్రకటిస్తారు.
వైయస్సార్ నేతన్న నేస్తం పథకం కు అవసరమైన పత్రాలు :
పాత అప్లికేషన్స్ రెన్యువల్ చేయుటకు :
- ఆధార్ కార్డు జిరాక్స్
- రైస్ కార్డు లేదా రైస్ కార్డు నెంబరు జిరాక్స్
- పాతది ఇన్కమ్ సర్టిఫికెట్ ఉన్న లేకున్నా పరవాలేదు
- మగ్గం కార్డు జిరాక్స్
- మగ్గం సర్టిఫికెట్ 2 జిరాక్స్ కాపీలు జత చేసి ఇవ్వవలెను
క్రొత్తగా అప్లై చేసుకునే వారి కొరకు :
- ఆధార్ కార్డు జిరాక్స్
- రైస్ కార్డు జిరాక్స్
- అప్లికేషన్ ఫారం
- మగ్గం కార్డు జిరాక్స్
- బ్యాంకు ఎకౌంటు జిరాక్స్
- ఇన్కమ్ సర్టిఫికెట్ renual చేసుకున్నది అయినా సరే కొత్తది అయినా సరే
- మగ్గం వెరిఫికేషన్ ఫారం 3 కాఫీలు
- GST బిల్లులు గడచిన ఆరు నెలల నుండి అనగా జనవరి నుండి ఇప్పటివరకు వారు ఏమైనా తీసుకుని ఉంటే సంబంధించిన బిల్లులు ఇవ్వవలెను
- మగ్గం లో కూర్చొని వేస్తున్నప్పుడు తీసిన ఫోటో ఒకటి.
వైయస్సార్ నేతన్న నేస్తం పథకం కు ఎవరిని సంప్రదించాలి :
గ్రామ సచివాలయాలు:
- సిద్ధం చేసిన నేతన నేస్తం లబ్ధిదారుల జాబితాలు ఆన్‌లైన్‌లో మరియు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. సచివాలయాలలో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో జాబితాలు ప్రదర్శించబడుతున్నాయి.
Contact Details for Andhra Pradesh Department of Handlooms and Textile:
- హెల్ప్ లైన్ నెంబర్ : 08645-232466 , 08645-232477
- హెల్ప్ డెస్క్ ఇమెయిల్ : handlooms_textiles@yahoo.com
- చిరునామా : Commissionerate of Handlooms & Textiles, APCO Chenetha Samudayam, Errabalem, Mangalagiri, Amaravathi, Andhra Pradesh,522503.
- హెల్ప్ లైన్ నెంబర్ : 1902
- హెల్ప్ డెస్క్ ఇమెయిల్ : info@gsws.ap.gov.in
ఆధార్ కార్డు కు ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయినదో తెలుసుకునే విధానము :
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు గాను నగదును డైరెక్టర్గా బ్యాంకు ఖాతాలో కాకుండా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలో మాత్రమే నగదును జమ చేయడం జరుగుతుంది. కావున సంక్షేమ పథకాలకు అర్హులైనటువంటి వారు వారి ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు కాకా లింక్ అయినదో తెలుసుకునేందుకు తప్పనిసరిగా ఆధార్ కార్డుకు ఫోను నెంబర్ లింక్ అయ్యి ఉండాలి.
ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకునే విధానము👇