PMJAY Card Delivery Process in Ayushman App by GSWS Volunteers
ఆయుష్మాన్ భారత్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల మెడికల్ సదుపాయం పొందుటకు గాను కార్డు తప్పనిసరిగా సిటిజన్ వద్ద ఉండవలెను. ఆ కార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ముందుగా ప్రజలకు ఈ కేవైసీ కూడా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. సచివాలయాలకు వస్తున్నటువంటి కార్డులను ఆయుష్మాన్ యాప్ వాలంటీర్ల లాగిన్ లో Card Delivery ఆప్షన్ ద్వారా Delivery చేసి తరువాత ప్రజలకు కార్డులను అందించవలెను.
ఆయుష్మాన్ యాప్ లో Card Delivery చేయు విధానం :
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన రీసెంట్గా అప్డేట్ అయినా ఆయుష్మాన్ యాప్ ను అందరూ వాలంటీర్లు డౌన్లోడ్ చేసుకోవలెను.
Step 2 : యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద చూపిన విధంగా LOGIN పై క్లిక్ చేయాలి.
Step 3 : Operator ను ఎంచుకోవాలి.
Step 4 : Registered Mobile Number / User ID వద్ద వాలంటీర్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి VERIFY పై టిక్ చేయాలి.
Step 5 : Auth Mode లో Mobile OTP లేదా Aadhaar OTP ఎంచుకోవాలి.
Step 6 : మొబైల్ కు 6 అంకెల OTP వస్తుంది. బాక్స్ లలో ఎంటర్ చేయాలి.
Step 7 : Captcha కోడ్ ఎంటర్ చేసి LOGIN పై టిక్ చేయండి.
Step 8 : Search For Beneficiary పేజీ ఓపెన్ అవుతుంది.
- State - Andhra Pradesh
- Scheme - PMJAY
- Search By - Aadhaar / Family ID / Location / ID
- District - మీ జిల్లా
పై ఆప్షన్ లు చూపిస్తుంది.
Step 9 : ఆధార్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయాలి అంటే Search By లో Aadhaar Number సెలెక్ట్ చేయాలి. తరువాత Search పై టిక్ చేయాలి.
Step 10 : కుటుంబంలోని అందరి పేర్లు చూపిస్తుంది. అందులో Download Card పై టిక్ చేయాలి. Do - eKYC అంటే వారికి ఈ కేవైసీ పెండింగ్ ఉన్నది అని అర్థము. eKYC పూర్తి అయితేనే Download Card ఆప్షన్ చూపిస్తుంది.
Step 11 : Card Delivery ఆప్షన్ పై టిక్ చేయాలి.
Step 12 : ఎవరికీ కార్డు ఇస్తున్నారో వారి ఫోటో పై టిక్ చేయాలి. ఇక్కడ No Beneficiary Found / No Data Available / Photo Not Updated అని వస్తే వారికీ మరలా eKYC చేయాలి.
Step 13 : Authentication లో Aadhaar OTP / Face Auth / Finger లో ఏది అయితే ఆ ఆప్షన్ ఎంచుకోవాలి.
Step 14 : ధ్రువీకరణ పూర్తి అయిన తరువాత Submit పై క్లిక్ చేయాలి.
Step 15 : వ్యక్తికి కార్డు డెలివరీ పూర్తి అయినది అని కింద చూపిన విధంగా మెసేజ్ వస్తుంది Okay పై క్లిక్ చేయాలి. ఈ విధముగా చేసిన వారికి మాత్రమే ప్రభుత్వం తరఫున కార్డు డెలివరీ అయినదని గుర్తించబడుతుంది.