Aadhaar Card Document Update In Telugu
What is Aadhaar Document Update
ఆధార్ కార్డు పొంది 10 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి . ఆధార డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఫోటో , బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడం కాదు , వ్యక్తి పేరు మరియు చిరునామాను ధ్రువీకరిస్తూ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవటమే ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ .
Aadhaar Document Update Last Date
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కు చివరి తేదీ June 14 , 2025 . గడువు లోపు ఉచితంగా ఎవరికి వారు వారి మొబైల్ లోనే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు . June 14 తరువాత కూడా డాక్యుమెంట్ అప్డేట్ అవుతుంది కానీ దానికి ప్రభుత్వం రుసుము వసూలు చేయడం జరుగుతుంది .
What happen if Aadhaar Document Update Not Done ?
Is Aadhaar document update necessary?
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోకపోతే ఈ యొక్క ఆధార్ కార్డు వెంటనే రద్దు అవ్వదు అనే విషయాన్ని గమనించండి , కానీ ఆధార్ను ఉపయోగించే సమయంలో మీరు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కావున అందరూ తప్పనిసరిగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్లు చేసుకోవాలి
List Of Acceptable Documents For Enrolment And Update In Telugu
POI అనగా Proof Of Identity అంటే మీ గుర్తిపు కు సంబందించిన ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ గా తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. POA అనగా Proof Of Address అంటే మీ చిరునామాకు సంబందించి ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ గా తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు మరియు భారత దేశ చిరునామా ఉండాలి.
List Of POI Accepted Documents in Telugu
- భారతీయ పాస్ పోర్ట్
- పాన్ కార్డు
- రేషన్ కార్డు
- ఆరోగ్యశ్రీ కార్డు
- ఓటర్ కార్డు
- డ్రైవింగ్ లైసెన్సు
- పెన్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు
- రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కార్డు
- వికలాంగుల కార్డు
- డొమెసేల్ సర్టిఫికేట్
- నివాస ధ్రువీకరణ పత్రము
- ఉపాధి హామీ జాబు కార్డు
- లేబరు కార్డు
- పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా పై చదువులకు సంబంధించి ఒరిజినల్ మార్క్స్ సీటు
- ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డు
- ఆధార్ స్టాండర్డ్ సర్టిఫికెట్ ఫార్మేట్
- పెన్షనర్ ఇండక్షన్ డాక్యుమెంటు
- ఇతర కేంద్ర లేదా రాష్ట్ర రుజువు పత్రము
Note : POI వాడే రుజువు పత్రంలో తప్పనిసరిగా వ్యక్తి యొక్క పేరు మరియు ఫోటో ఆధార్ కార్డులో ఉండేలా ఉండాలి. గ్రూపు ఫోటోతో ఉన్న పరవాలేదు.
List Of POA Accepted Documents in Telugu
- భారతీయ పాస్ పోర్ట్
- రేషన్ కార్డు
- ఆరోగ్యశ్రీ కార్డు
- ఓటర్ కార్డు
- వికలాంగుల కార్డు
- డొమెసేల్ సర్టిఫికేట్
- నివాస ధ్రువీకరణ పత్రము
- ఉపాధి హామీ జాబు కార్డు
- లేబరు కార్డు
- ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డు
- విద్యుత్ బిల్లు
- టెలిఫోన్ ల్యాండ్ లైన్ లేదా పోస్ట్ పెయిడ్ మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ బిల్లు
- రిజిస్టర్ ఆఫీసులో ఇచ్చినటువంటి వాలెట్ రిజిస్ట్రేషన్ సేల్ అగ్రిమెంటు లేదా గిఫ్ట్ డిడ్
- గ్యాస్ కనెక్షన్ బిల్లు
- కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా పిఎస్యు లేదా రెగ్యులేటరీ బాడీస్ లేదా స్టాట్యూచరి బాడీస్ ఇచ్చినటువంటి వసతి కేటాయింపు పత్రము
- లైఫ్ లేదా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ
- పెన్షనర్ యొక్క ఇండక్షన్ డాక్యుమెంట్
- ఇతర కేంద్ర లేదా రాష్ట్ర రుజువు పత్రము
Note : POA వాడే రుజువు పత్రంలో తప్పనిసరిగా వ్యక్తి యొక్క చిరునామా, ఆధార్ కార్డులోని చిరునామా దగ్గరగా ఉండాలి ఉండాలి.
How to Update Aadhaar Card Online for Free ?
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను రెండు రకములుగా చేసుకోవచ్చు. మీ సొంత లాగిన్ లో మరియు ఆధార్ సేవా కేంద్రాల్లో . మీ సొంత లాగిన్ లో చేసుకోటానికి మీ ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే సరిపోతుంది. అదే ఆధార్ సేవా కేంద్రాల్లో చేయటానికి ఆధార్ - మొబైల్ లింక్ అవసరం లేదు. ప్రస్తుతానికి 50 రూపాయల ఫీజు కాస్త పెరిగే అవకాశం ఉంది కావున కింద తెలిపిన విధముగా మీ యొక్క ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను మీకు మీరుగా సొంతంగా చేసుకోండి....