YSR Cheyutha Payment Status
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి మహిళలకు అందిస్తున్న వైఎస్సార్ చేయూత పథకం YSR Cheyutha Scheme 4వ విడత నెలరోజుల ముందుగానే సీఎం వారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగినది. ఎలక్షన్ కోడ్ మరియు ఇతర కారణాల వలన మహిళలకు వారి ఖాతాలో నగదు జమ అవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఎలక్షన్లు పూర్తయిన తరువాత ఎప్పుడైనా నగదును జమ చేసుకోవచ్చని ప్రభుత్వానికి తెలియచేయడం జరిగినది. ఎలక్షన్ మే 13న పూర్తయినప్పటికీ ముందుగా వైయస్సార్ ఆసరా, జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నగదులు జమ అవుతూ వస్తున్నాయి.
అన్ని పథకాల కెల్లా ఎక్కువగా నగదు సుమారు 5 వేల కోట్లు నగదు వైయస్సార్ చేయూత పథకం ద్వారా మహిళలకు వారి ఖాతాలో జమ అవ్వవలసి ఉంది. తేదీ మే 18 సాయంత్రం నుండి వైయస్సార్ చేయూత నగదు క్రెడిట్ అవ్వటం మొదలు అయ్యింది. నగదు ఒకే రోజులో కాకుండా రోజుల వారీగా క్రెడిట్ అవుతూ ఉంటుంది కావున ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదు. నగదు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలో ఎప్పటిలానే క్రెడిట్ అవుతుంది.
![]() |
YSR Cheyutha SMS |
వైయస్సార్ చేయూత నగదు క్రెడిట్ YSR Cheyutha Payment అవ్వాలి అంటే తప్పనిసరిగా అన్ని స్టేజిలలో వారి దరఖాస్తు ఆమోదం పొంది ఉండాలి, అప్పుడే వారికి నగదు క్రెడిట్ అవుతుంది. అదేవిధంగా బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు కూడా సరిగా NPCI లింకు అయి ఉండాలి. పై రెండు స్టేజీలు పూర్తి అయిన వారికి నగదు ముందుగా పడటం జరుగుతుంది.
Check YSR Cheyutha Applicatuion and Payment Status
వైస్సార్ చేయూత పథకం అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము :
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన అధికారిక లింకుపై క్లిక్ చేసి ఓపెన్ చేయండి
Step 2 :
- Scheme వద్ద YSR Cheyutha
- Year వద్ద 2024-25
- UID వద్దా లబ్ధిదారుని ఆధార్ నెంబరు
- Enter Captcha వద్ద పైన చూపిస్తున్న నెంబరు ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేయండి.
Step 3 : ఆధార్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ క ఎంటర్ చేసి Verify OTP పై క్లిక్ చేయండి.
Step 4 : కింద చూపిన విధముగా
Basic Details
- జిల్లా
- మండలం
- సచివాలయము
- సచివాలయం కోడు
- వాలంటీర్ కోడు
- అభ్యర్థి పేరు
- అభ్యర్థి ఆధార నెంబర్
Application Details
- దరఖాస్తు నెంబరు
- దరఖాస్తు చేసిన తేదీ
- దరఖాస్తు స్థితి
Payment Details
- పేమెంట్ స్టేటస్
- పేమెంటు ఏ బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అయిందో రిమార్క్
కొందరికి పైన తెలిపిన బేసిక్ వివరాలు మాత్రమే చూపిస్తుంది. ఒకసారి పేమెంట్ పూర్తయిన తర్వాత అప్లికేషన్ వివరాలు మరియు పేమెంట్ వివరాలు రెండు కూడా చూపిస్తాయి. కావున అందరూ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ను చూసుకోండి. పేమెంట్ డీటెయిల్స్ లో బ్యాంకు వివరాలు చూపిస్తున్నట్టయితే త్వరలోనే వారికి నగదు క్రెడిట్ అవుతుంది అని అర్థము.
నగదు క్రెడిట్ అయినట్టు అయితే SMS రూపంలో మెసేజ్ వస్తుంది. లేకపోతే నగదు క్రెడిట్ అయినదో లేనిదో అని తెలుసుకోవడానికి Phone Pay / GPay ఉన్నవారు నేరుగా చూసుకోవచ్చు. బ్యాంకుకు వెళ్లకుండా బ్యాంకు ఖాతాకో లింక్ అయిన మొబైల్ నెంబరు పనిచేస్తున్నట్టయితే దాని నుండే నేరుగా ఒక Missed Call ఇచ్చి మనం బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. కింద తెలిపిన నెంబర్లకు ఫోన్ చేసి బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు