Rationalization of Village/Ward Secretariats and Functionaries: Key Insights from GOMS 1
ఎట్టకేలకు గ్రామ వార్డు సచివాలయల , ఉద్యోగుల హేతుబద్దీకరణ Rationalization of Village/Ward Secretariats and Functionaries 2025 కు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసినది .తేదీ జనవరి 25,2025 రాత్రి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి GOMS నెంబర్ 1 విడుదల చేసినది. అందులో ముఖ్యంగా జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మల్టీ పర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలు Multipurpose, Technical and Aspirational Functionaries గా విభజన చేస్తున్నట్లు తెలిపింది. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
What GOMS 1 Consists ?
ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నటువంటి ముఖ్యంశాలు
1.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి . అందులో గ్రామ సచివాలయాల్లో 11 మంది సిబ్బంది వార్డు సచివాలయాల్లో 10 మంది సిబ్బంది చొప్పున ప్రస్తుతానికి పనిచేస్తున్నారు .
2.గ్రామ సచివాలయ సిబ్బందిని మూడు కేటగిరీలుగా విభజించనున్నారు .
- మల్టీపర్పస్ [ Multipurpose Functionaries ]
- టెక్నికల్ మరియు [ Technical Functionaries ]
- ఆస్పిరేషనల్ ఉద్యోగులుగా [ Functionaries Functionaries ]
సచివాలయ ఉద్యోగులను విభజన చేయనున్నారు. ఏ సచివాలయ సిబ్బంది ఏ క్యాటగిరిలోకి వస్తారనే విషయాన్ని మాత్రం జీవోలో ప్రస్తావించలేదు కానీ గతంలో అసెంబ్లీ సమావేశంలో మినిస్టర్ వారు కింద తెలిపిన విధంగా తెలియజేయడం జరిగినది అధికారికంగా ఉత్తర్వులు విడుదల అయిన తర్వాత దీనిపై తుది నిర్ణయానికి రండి.
మల్టీపర్పస్ ఫంక్షనరీస్ [ GSWS Multipurpose Functionaries ]
గ్రామ సచివాలయ [ Village Secretariat ] పరిధిలోని
- పంచాయతీ సెక్రటరీ,
- డిజిటల్ అసిస్టెంట్,
- వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్,
- గ్రామ మహిళా పోలీస్ వస్తారు.
వార్డు సచివాలయ [ Ward Secretariat ] లో
- వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ,
- వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ,
- వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ,
- వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు.
టెక్నికల్ ఫంక్షనరీస్ [GSWS Technical Functionaries ]
గ్రామ సచివాలయ [ Village Secretariat ] పరిధిలోని
- విలేజ్ రెవెన్యూ ఆఫీసర్,
- ANM,
- సర్వే అసిస్టెంట్,
- ఇంజనీరింగ్ అసిస్టెంట్,
- అగ్రికల్చర్ సెక్రటరీ,
- వెటర్నరీ సెక్రటరీ, ఎ
- నర్జీ అసిస్టెంట్ ఉంటారు.
వార్డు సచివాలయ [ Ward Secretariat ] లో
- వార్డు రెవెన్యూ సెక్రటరీ,
- వార్డు హెల్త్ సెక్రటరీ,
- వార్డు ప్లానింగ్ సెక్రటరీ,
- వార్డు ఎమినిటీస్ సెక్రటరీ,
- వార్డ్ శానిటేషన్ సెక్రటరీ,
- వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు.
3. సచివాలయాలను కూడా జనాభా ఆధారంగా 3 విధాలుగా విభజన చేయనున్నారు . సచివాలయంలో
- Category “A” సచివాలయం - 2500 లోపు జనాభా
- Category “B” సచివాలయం - 2501 నుండి 3,500 జనాభా
- Category “C” సచివాలయం - 3,500కు పైగా జనాభా
ఇక నుంచి సచివాలయాలు రూపు రేఖలు మారనున్నాయి.
4. ఉద్యోగుల సంఖ్య ఇలా ఉండనుంది
- 2500 లోపు జనాభా ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయాలలో మినిమం 6 సచివాలయ సిబ్బంది ఉండాలి
- 2501నుండి 3500 లోపు జనాభా ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయాలలో మినిమం 7 సచివాల సిబ్బంది ఉండాలి
- 3500 పైగా ఉన్నటువంటి సచివాలయాలలో మినిమం 8 మంది సచివాలయ సిబ్బంది ఇకనుంచి తప్పనిసరిగా పని చేయాల్సి ఉంటుంది.
గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య అనేది పాపులేషన్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక విషయాలపై మరియు సచివాలయం పై ఉన్నటువంటి పని భారంపై ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పిన కౌంట్ కన్నా ఎక్కువ ఉండే అవకాశం కూడా పై అంశాల ఆధారంగా ఉండనుంది.
5. గ్రామా లేదా వార్డు సచివాలయ పరిధిలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ [IoT] , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ [AI] , డ్రోన్లు మరియు ఇతర డీప్ టెక్నాలజీలను ప్రభుత్వ ద్వారా అందించేందుకు కొత్తగా గ్రామాల వార్డు సచివాలయ పరిధిలో ఆస్పిరేషనల్ సిబ్బందిని [ Aspirational Functionary ] ప్రభుత్వం అడాప్ట్ చేసుకోనుంది. సచివాలయ సిబ్బందిలో ఎవరైతే టెక్నికల్ లేదా టెక్నికల్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉండి టెక్నాలజీలపై ఇష్టం ఉన్నవారికి ఆస్పిరేషనల్ ఉద్యోగులుగా [ Aspirational Functionary ] చేయనున్నారు .
6. సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ Rationalization of Village/Ward Secretariats and Functionaries పూర్తయిన తర్వాత సచివాలయ ఉద్యోగులు మిగిలినట్టయితే వారిని గ్రామ వార్డు సచివాలయ శాఖ లో ఫీల్డ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లో డిప్లయ్మెంట్ అనగా ఇతర డిపార్ట్మెంట్లలో మార్పు చేయనున్నారు.
టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి ⇓
7. ఇక నుంచి గ్రామ సచివాలయాలకు పంచాయతీ కార్యదర్శి , వార్డు సచివాలయ కు వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు హెడ్ గా ఉండనున్నారు .
8. ఇకనుంచి సచివాలయ వ్యవస్థ అనేది 3 అంచలుగా ఉండనుంది .
- జిల్లా స్థాయిలో జిల్లా గ్రామ వార్డు సచివాలయ ఆఫీసు
- మండల స్థాయిలో మండల లేదా ULB ఆఫీస్
- గ్రామ లేదా వార్డు స్థాయిలో గ్రామా లేదా వార్డు సచివాలయాలలు
ఉండనున్నాయి .
9.ఇకమీదట గ్రామ సచివాలయాలు లేదా వార్డు సచివాలయ అనేది గ్రామాల వార్డు స్థాయిలో నాలేజ్ హబ్ [knowledge society] గా డిజిటల్ లిటరసీ ,ఆర్టిఫిషల్ అండ్ ఇంటెలిజెన్స్ , ఎం.ఎస్.ఎం.ఈ ,ఫుడ్ ప్రాసెసింగ్ ,మార్కెటింగ్ ఎంప్లాయిమెంట్ జనరేషన్, ప్రోడక్ట్ల క్రియేషన్ వంటి అంశాలపై కేంద్రంగా పనిచేయని ఉన్నాయి .
10. గ్రామ వార్డు సచివాలయాలను స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 టార్గెట్లను అచీవ్ చేసే విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను పూర్తిగా Rationalization of Village/Ward Secretariats and Functionaries హేతుబద్ధీకరణ ప్రభుత్వం చేయనుంది .
11. పై విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రెటరీ అయినటువంటి భాస్కర్ కాటమనేని వారు డైరెక్టర్ GSWS డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు అందించారు . తర్వాత డైరెక్టర్ గ్రామ వార్డు సచివాలయ శాఖ వారు సచివాలయ శాఖ నుండి ప్రతి జిల్లా కలెక్టర్లకు త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తారు అప్పుడు ఈ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది.
గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది హేతుబద్ధీకరణ పై చేసినటువంటి ప్రతి పోస్టును చూడడానికి కింద లింకును ఓపెన్ చేసి చదవగలరు
Clear Ga Chepparu. Thanks 👍🏼
ReplyDeleteMultipurpose functionaries lo ఎవరెవరు ఉంటారు అనేది చెప్పారు.
ReplyDeleteమరి ఇద్దరు ఉన్నప్పుడు ఎవరెవరు ఉంటారు ముగ్గురు ఉన్నప్పుడు ఎవరెవరు ఉంటారు
నలుగురు ఉన్నప్పుడు ఎవరెవరు ఉంటారు అనే విషయంచెప్పలేదు
Me Sachivalayam and meeku daggiralo unna Sachivalayam....example me Sachivalayam lo digital assistant,mahila police,pakka Sachivalayam lo welfare assistant, Panchayat secretary untaru.... for example meeru digital assistant ayithe me Sachivalayam lo regular duty and multipurpose Functionaries ga work chesthu pakka sachivalayam lo incharge digital assistant duty chestharu.....ilaga welfare, mahila police kuda untundhi
Delete5 ఏళ్ళు పూర్తి అయిన వార్డు సెక్రెటరీ లు వార్డు లొనే ట్రాన్స్ఫర్ అవుతారా లేక విలేజీలకు పంపుతారా? టీచర్ల లాగా 16% హెచ్ ఆర్ ఏ లో చేసినవారు 10%లోకి వెళతారా లేక జీవితమంతా 16% లొనే ఉంటారా.10% హెచ్ ఆర్ ఏ వాళ్ళు జీవితమంతా గ్రామాల్లోనే ఉండాలా
ReplyDelete